వయసు మీద పడుతున్న కానీ తన లో పవర్ ఇంకా తగ్గలేదని మరో సారి నిరూపించాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్. ప్రస్తుతం ఈ 38ఏళ్ళ ఆటగాడు పాకిస్థాన్ క్రికెట్ లీగ్ లో క్యూట్టా గ్లాడియేటర్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అందులో భాగంగా  ఆదివారం కరాచీ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో వాట్సన్ కేవలం 22బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేయడమే కాదు అజేయ ఇన్నింగ్స్ తో తమ జట్టుకు విజయాన్ని అందించాడు. 34బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్ల తో వాట్సన్  66 పరుగులు చేయగా అతనికి తోడు మంజూర్ (63) కూడా రాణించడంతో క్యూట్టా 16.2 ఓవర్లోనే లక్ష్యాన్ని ఛేదించింది. వాట్సన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన కరాచీ కింగ్స్ 20 ఓవర్ల లో 5 వికెట్ల నష్టానికి 150పరుగులు చేసింది.. డెల్ పోర్ట్ (62),బాబర్ అజామ్ (32) రాణించారు. 
 
అయితే ఈమ్యాచ్ లో క్యూట్టా విజయం సాధించిన కూడా సెమిస్ కు అర్హత సాధించలేకపోయింది.పెషావర్ జెల్మి తో సమానంగా పాయింట్లను రాబట్టుకున్న క్యూట్టా రన్ రేట్ విషయం లో ఆజట్టు కంటే వెనుకబడి ఉండడం తో పెషావర్ సెమిస్ లోకి అడుగుపెట్టింది మరో వైపు ఓడిపోయినప్పటికీ కరాచీ పాయింట్ల పట్టిక లో రెండో స్థానం తో సెమిస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: