ప్రస్తుతం కరోనా వైరస్ నేపధ్యం కారణం చేత ఈ ఏడాది కొన్ని క్రికెట్ సిరీస్ ‌లని ఖాళీ స్టేడియాల్లో నిర్వహించాలని వార్తలు వినిపిస్తుండటంపై టీమిండియా మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్ తన నిరాశను వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా దేశంలో ఈ సంవత్సరం అక్టోబరులో టీ - 20 వరల్డ్ ‌కప్ జరగనుండగా.. అయితే ఆ స్టేడియంలోకి ప్రేక్షకుల్ని అనుమతించకుండా ఈ మెగా టోర్నీని ఎలా నిర్వహించాలని కొంతమంది డిమాండ్స్ చేస్తున్నారు. ఒకవేళ గనుక ఈ టీ - 20 వరల్డ్‌కప్ కాని వాయిదాపడితే..? అక్టోబరు నెలలో ఐపీఎల్ -‌ 2020 సీజన్ ‌ని మొదలుపెట్టాలని bcci ప్లాన్ చేస్తుండగా.. అయితే ఈ టోర్నీకి కూడా ప్రేక్షకుల్ని స్టేడియంలోకి అనుమతించడం కష్టమే అని చెప్పవచ్చు.


 
ఇకపోతే మ్యాచ్ చూసేందుకు స్టేడియంలోకి ప్రేక్షకుల్ని అనుమతించకపోతే.. క్రికెటర్స్ లోను ఉత్సాహం ఉండదని సచిన్ తన అభి ప్రాయం తెలిపాడు. అలాగే ‘‘ఖాళీ స్టేడియంతో మైదానంలోని ఆటగాళ్లుకు కూడా నిరుత్సాహా పడతారని సచిన్ తెలిపాడు. నిజానికి అభిమానుల అల్లరి, అరుపులు, కేరింతలు కచ్చితంగా క్రికెటర్లని మైదానంలో పరుగుపెట్టిస్తాయని బ్యాట్స్‌ మెన్ మంచి షాట్ కొడితే ప్రేక్షకులు స్పందించే తీరు అతడిలో చాలా ఎనర్జీని మరింత పెంచుతాయి అని అంటున్నాడు లిటిల్ మాస్టర్. ఇంకోవైపు బౌలర్ మంచి స్పెల్ వేస్తే, ఫ్యాన్స్ వారి అరుపులు బ్యాట్స్‌ మెన్ ‌పై ఒత్తిడిని పెంచుతాయని సచిన్ టెండూల్కర్ తెలిపాడు.

 
ఇక కరోనా వైరస్ నియంత్రణకి ఒక్క సామాజిక దూరం ఒక్కటే మార్గమని వైద్య నిపుణులు చెబుతుండగా ఒకవేళ స్టేడియంలోకి వేలాది మందిని పంపితే కరోనా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉండడంతో దీనితో ఇప్పట్లో స్టేడియంలోకి ఫ్యాన్స్‌ ని అనుమతించే ప్రస్తావనని bcci తో పాటు అన్ని క్రీడా పోటీల నిర్వాహకులు దీని గురించి ఆలోచనలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: