ఈ ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులందరికీ ప్రతి విషయంలో నిరాశ ఎదురైంది అన్న విషయం తెలిసిందే. ధోని తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఎంతో మంది సీఎస్కే అభిమానులు నిరాశ లో మునిగిపోయారు. అంతలోనే  సురేష్ రైనా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్లో ధోనీ బాగా రాణిస్తాడు అనుకుంటే పేలవ ప్రదర్శన చేసి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాడు అనే విషయం తెలిసిందే.  ఇక ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్ సీజన్ లో మునుపెన్నడూ లేనివిధంగా పేలవ ప్రదర్శన చేసి ఐపీఎల్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. మొట్టమొదటిగా చెత్త రికార్డును నమోదు చేసింది. ఇప్పటివరకు ఐపీఎల్ లో ప్రతిసారి ప్లే ఆప్ కి అర్హత సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈసారి మాత్రం లీగ్ దశతో  సరిపెట్టుకోవాల్సి వచ్చింది.




 అయితే సరిగ్గా ఐపీఎల్ ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ లో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న సురేష్ సీజన్  సీజన్ నుంచి తప్పుకోవడం అభిమానులందరికీ మరింత నిరాశపరిచింది అని చెప్పాలి. 2021 సీజన్కు కార్యాచరణ జరుగుతూ ఉండగా ప్రస్తుతం సీజన్ ముంగిట చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులందరిలో  ఉత్సాహాన్ని నింపే ఒక వార్త ప్రస్తుతం బయటికి వచ్చింది.  2020 ఐపీఎల్ సీజన్ లో అర్థంతరంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నుంచి తప్పుకున్న సురేష్ రైనా వచ్చే ఏడాది మళ్లీ చెన్నై జట్టు తరపున ఆడుతున్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ అధికారి చేశారు.




ఈ  ఏడాది పాయింట్ల పట్టిక లో చివరి స్థానంలో కొనసాగుతూ చివరికి  దశలోనే ఐపీఎల్ టోర్నీ నుంచి నిష్క్రమించింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. అయితే సురేష్ రైనాను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం వదులుకునేందుకు ఆలోచన చెయ్యడం లేదని ముంబై మిర్రర్ చెన్నై సూపర్ కింగ్స్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. ఇది ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులందరికీ ఒక అదిరిపోయే శుభవార్త అని చెప్పాలి. 2008 నుంచి సురేష్ రైనా ఐపీఎల్ ఆడుతూ ఉండగా ప్రస్తుతం చెన్నై టీం లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇప్పుడు వరకు సురేష్ రైనా 4527 పరుగులు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: