యువ క్రికెటర్ సంజూ శాంసన్ పై మరోసారి విమర్శలు వస్తున్నాయి. ఎన్నో రోజుల నుంచి సంజూ శాంసన్  నిలకడలేని పై విమర్శలు వస్తూనే ఉన్నాయి. సంజూ శాంసన్ ఎంతో అద్భుతంగా రాణించడం అందరి చూపు ఆకర్షించడం లాంటివి చేస్తూ ఉంటాడు. కానీ ఆ తర్వాత మాత్రం అదే ఫామ్ కొనసాగించ లేక ఇబ్బంది పడుతూ ఉంటాడు. మొదటి రెండు మూడు మ్యాచ్లు ఎంతో అనుభవం గల క్రికెటర్ లాగా మ్యాచ్లు ఆడే సంజూ శాంసన్ ఇక ఆ తర్వాత అసలు అనుభవం లేని క్రికెటర్ కంటే దారుణంగా విఫలం అవుతూ ఉంటాడు. ఇక సంజు శాంసన్ నిలకడలేమి కారణంగానే అటు భారత జట్టులో కూడా  చోటు దక్కించుకోలేకపోతున్నాడు.



 అయితే ప్రతిసారీ కూడా సంజూ శాంసన్ నిలకడలేని రుజువు అవుతుంది. ముఖ్యంగా ఐపీఎల్లో అయితే సంజూ శాంసన్ ఆటపై   అందరూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈ ఐపీఎల్ సీజన్ లో ఏకంగా రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు సంజూ శాంసన్. కెప్టెన్ అయిన తర్వాత అయినా ఎంతో ఆచి తూచి ఆడతాడు అని అనుకున్నారు అందరు అయితే మొదటి మ్యాచ్లో సంజు శాంసన్ మెరుపులు మెరిపించాడు  అని చెప్పాలి. దీంతో సంజూ శాంసన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు అంటూ ఎంతో మంది ప్రశంసలు కురిపించారు.  కానీ ఎప్పటిలాగానే మళ్లీ తన నిలకడలేమితో విమర్శలు ఎదుర్కొంటున్నాడు.



 మొదటి మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన సంజూ శాంసన్ ఆ తర్వాత మాత్రం తక్కువ పరుగులు చేయడానికి కూడా ఎన్నో తంటాలు పడ్డాడు దీంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు వరుసగా ఓటమి ఫాలు అవుతూ వచ్చింది.  అయితే తాజాగా సంజు శాంసన్ కెప్టెన్సీపై గౌతం గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంజూ శాంసన్ లో నిలకడ అసలు లేదని మొదటి మ్యాచ్లో ఎంతో అద్భుతంగా రాణించి ఇక ఆ తర్వాత మాత్రం దారుణంగా విఫలం అవుతాడు అంటూ విమర్శించారు. ఒక మంచి ప్లేయర్ గ్రాఫ్ మరీ అధ్వానంగా ఉండకూడదు అంటే గౌతం గంభీర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. మొదటి మ్యాచ్ లో 80 పరుగులు చేసిన సంజూ శాంసన్ తర్వాత మాత్రం 10 పరుగులు చేయడానికి కూడా ఎంతో ఇబ్బంది పడ్డాడు అంటూ చెప్పుకొచ్చాడు .

మరింత సమాచారం తెలుసుకోండి: