ఆఫ్ఘనిస్తాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ కి ప్రపంచ క్రికెట్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  ప్రస్తుతం ఎంతో మంది లెగ్ స్పిన్నర్లు ఉన్న రషీద్ ఖాన్ మాత్రం తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. తన లెగ్ స్పిన్ బౌలింగ్ తో ఎప్పుడూ మాయ చేస్తూ ఉంటాడు రషీద్ ఖాన్. ఇక అఫ్ఘనిస్తాన్ జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయాడు. తక్కువ సమయంలోనే స్టార్ ప్లేయర్ రేంజిని సంపాదించాడు రషీద్ ఖాన్. అయితే రషీద్ ఖాన్ ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ గా కంటే అటు ఐపీఎల్ ప్లేయర్ గానే ఎక్కువగా భారత ప్రేక్షకులకు తెలుసు.



 ఎందుకంటే ఐపీఎల్ వస్తుందంటే చాలు ప్రేక్షకులు అందరూ ఎంతో ఆతృతగా వీక్షిస్తూ ఉంటారు. ఐపీఎల్ లో సన్రైజర్స్ హైదరాబాదులో రషీద్ ఖాన్ ఆడుతూ ఉంటాడు. అయితే జట్టులో కీలక బౌలర్ గా వ్యవహరిస్తుంటాడు. సరైన సమయంలో వికెట్లు పడగొడుతూ జట్టుకు విజయాలను అందించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.  ఇక తన స్పిన్ బౌలింగ్ తో స్టార్ బ్యాట్స్మెన్ లకు సైతం చమటలు పట్టిస్తూ ఉంటాడు రషీద్ ఖాన్. తన అద్భుతమైన ప్రతిభతో అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాడు. అయితే ఇటీవలే అభిమానులు  అందరికీ ఒక శుభవార్త అందింది.



 ఇప్పటికే తన టాలెంట్ నిరూపించుకుని ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న రషీద్  ఇక ఇటీవల ఒక అద్భుతమైన అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఏకంగా ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు కెప్టెన్గా ఎంపికయ్యాడు రషీద్ ఖాన్.  ఆఫ్ఘనిస్తాన్ తరఫున టి20 ఫార్మాట్కు సారథ్యం వహించేందుకు సిద్ధమవుతున్నాడు.  అతనిలో ఉన్న నాయకత్వ లక్షణాలు అతని అనుభవం అద్భుత ప్రదర్శన దృష్టిలో ఉంచుకుని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు టీ-20 జట్టు సారథ్య బాధ్యతలను రషీద్ ఖాన్ కు అప్పగిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. ఇకపోతే ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ టెస్ట్, వన్ డే జట్టుకు హస్మతుల్లా షాహిదీ కెప్టెన్ గా ఉన్నాడు. ఇప్పటికే లెగ్ స్పిన్నర్ గా నిరూపించుకున్న రషీద్ ఖాన్ కెప్టెన్గా ఎలా నిలదొక్కుకుంటాడో అన్నది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: