ఇండియా మరియు ఇంగ్లండ్ జట్ల మధ్య ఓవల్ వేదిక గా నాలుగో టెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు.. బోలి ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్... తక్కువ స్కోరుకే ఆల్ అవుట్ అయింది. 61 ఓవర్లలో 191 పరుగులు చేసి టీమిండియా కుప్పకూలింది. ఎప్పటిలాగే టీమిండియా టాప్ ఆర్డర్ మరియు మిడిలార్డర్ ఘోరంగా విఫలం కావడంతో.... ఇండియా తక్కువ పరుగులకే ఆలౌటైంది. చాలా రోజుల తర్వాత ఫామ్ లోకి వచ్చిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 50 పరుగులతో జట్టును ఆదుకున్నాడు. 

అలాగే శార్దుల్ ఠాకూర్ 57 పరుగులు చేసి  ఫర్వాలేదని పించాడు. ఇక మిగతా బ్యాట్స్మెన్ లు పూర్తిగా విఫలం అయ్యారు. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ నాలుగు వికెట్లు తీసి టీమిండియా నడ్డి విరిచారు. అలాగే ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ రాబిన్సన్ మూడు వికెట్లు, జేమ్స్ అండర్సన్ మరియు ఓవర్ టన్ తలో వికెట్ తీసి  పర్వాలేదనిపించారు. టీమ్ ఇండియా ఆల్ అవుట్ కావడంతో ... మొదటి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లాండ్ జట్టు... భారత బౌలర్లు ఎదుర్కోవడంలో తడబడుతోంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 53 పరుగులు చేసి ఏకంగా మూడు వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్ జట్టు.

17 ఓవర్లు ఆడిన ఇంగ్లాండ్ జట్టు మూడు వికెట్లు కోల్పోయి 53 పరుగులు చేయగలిగింది. ఓపెనర్లు బర్న్స్ ఐదు పరుగులు, హమీద్ డక్ ఔట్ కాగా కెప్టెన్ రూట్ 21 పరుగులకే వెనుదిరిగాడు. ఇక ప్రస్తుతం డేవిడ్ మిలాన్ 26 పరుగులు మరియు ఓవర్ టన్ ఒక పరుగు  తో క్రిజ్ లో ఉన్నారు. ఇక ఇండియా బౌలింగ్ విషయానికి వస్తే.... ఉమేష్ యాదవ్ ఒక వికెట్ మరియు బమ్ర రెండు వికెట్లు పడగొట్టి... టీమిండియాకు మంచి కమ్ బ్యాక్ ఇచ్చారు. ఇక ఇవాల్టి రోజున భారత బౌలర్లు ధీటుగా ఆడితేనే ఇండియా విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఇవాళ మధ్యాహ్నం 3:30 సమయంలో రెండో రోజు ఆట ప్రారంభం కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: