దుబాయ్ లో ఐపీఎల్ 2021 రెండవ విభాగం మ్యాచులు చాలా ఉత్కంఠభరితంగా సాగుతోన్న సంగతి మనకు తెలిసిందే. అయితే  సెకండ్ ఫేజ్ లో భాగంగా... నిన్న కోల్కత్తా నైట్ రైడర్స్ జట్టు మరియు ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య పోరు సాగింది. అయితే ఈ మ్యాచ్ లో... దెబ్బకు దెబ్బ తీశాడు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆల్రౌండర్  రవిచంద్రన్ అశ్విన్. నిన్న రవిచంద్రన్ అశ్విన్ బ్యాటింగ్ చేస్తూ ఉండగా... సౌదీ మరియు అశ్విన్ ల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. అయితే ఈ ఘర్షణలో సౌదీకి... మద్దతు పలికాడు నైట్రైడర్స్ కెప్టెన్ మోర్గాన్. 

దీంతో ఆగ్రహానికి గురై .. ఇయాన్ మోర్గాన్ కు  బ్యాట్ కోపం గా చూపించాడు రవిచంద్రన్ అశ్విన్. అక్కడితో వివాదం అయిపోతుంది అనుకుంటే... రెండో ఇన్నింగ్స్ లో తన ప్రతాపం చూపించాడు రవిచంద్రన్ అశ్విన్. తన తప్పు లేకున్నా.. గెలికితే ఏమవుతుందో చూపించాడు రవిచంద్రన్ అశ్విన్. కేకేఆర్ ఇన్నింగ్స్ లో 12 వ ఓవర్లో లో క్రీజులోకి వచ్చాడు ఇయాన్ మోర్గాన్. ఈ సమయంలో బౌలింగ్ చేశాడు రవిచంద్రన్ అశ్విన్. అయితే రవిచంద్రన్ అశ్విన్ వేసిన ఆ ఓవర్ రెండో బంతి కే... వెనుదిరిగాడు కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్.

ఆ సమయంలో ఇయాన్ మోర్గాన్ పై గట్టిగా అరిచి చేశాడు రవిచంద్రన్ అశ్విన్. పెవిలియన్ కు వెళ్ళిపో అంటూ మోర్గాన్ పై కోపంగా గాండ్రించాడు రవిచంద్రన్ అశ్విన్. ఇది ఇలా ఉండగా ఈ మ్యాచ్ లో లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై కోల్కత్తా నైట్ రైడర్స్ జట్టు మూడు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.  మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఏకంగా 9 వికెట్లు నష్టపోయి 127 పరుగులు చేసింది. 128 పరుగుల టార్గెట్ ను కేవలం 18  ఓవర్ల లోనే ఫినిష్ చేసింది నైట్రైడర్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: