
ఇక ఆ తర్వాత 130 పరుగుల లక్ష్యంతో వచ్చిన ఒమాన్ మొదటి నుండే విజయపథంలో నడిచింది. ఆ జట్టు ఓపెనర్లు ఇద్దరు చెలరేగిపోయారు. జట్టు ఓపెనర్లు జితేందర్ సింగ్ 73 పరుగులు చేయగా... అకిబ్ ఇలియాస్ 50 పరుగులతో ఇద్దరు అర్థ శతకాలు చేసి రాణించడంతో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఒమాన్ జట్టు పై పాపువా న్యూ గినియా కేవలం 13.4 ఓవర్లలోనే విజయం సాధించింది. దాంతో ఈ ప్రపంచ కప్ లో మొదటి విజయం నమోదు చేసిన జట్టుగా ఒమాన్ నిలిచింది. అయితే ఈ మ్యాచ్ లో పాపువా న్యూ గినియా పై నాలుగు వికెట్లు తీసిన జీషన్ మక్సూద్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. అయితే ఈ మ్యాచ్ లో విజయం సాధించడంతో ఈ క్వాలిఫైర్స్ లో ఒమాన్ జట్టి ముందడుగు వేసింది. చూడాలి మరి ఈ జట్టు ముఖ్యమైన టోర్నీలోకి వస్తుందా... లేదా అనేది.