బిసిసీఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా విజయ్ హజారే ట్రోఫీ నిర్వహిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతో మంది యువ ఆటగాళ్లు విజయ్ హజారే ట్రోఫీలో సత్తా చాటుతూ ఉంటారు. అచ్చం ఐపీఎల్ తరహాలోనే ప్రాంతీయ జట్లు విజయ్ హజారే ట్రోఫీ లో పోటీ పడుతూ ఉంటాయి. అయితే మరికొన్ని రోజుల్లో బీసీసీఐ విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభించబోడుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అన్ని జట్లు కూడా ఇటీవలే తమ జట్టులోని ఆటగాళ్లు కు సంబంధించిన వివరాలను ప్రకటిస్తున్నాయ్. ఇందులో భాగంగానే తమిళనాడు జట్టు 20 మంది సభ్యులతో కూడిన జట్టును ఇటీవలే అధికారిక సోషల్ మీడియా ఖాతాలను రివీల్ చేసింది


 అయితే ఇటీవలే తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ విడుదల చేసిన జట్టులో అటు వెటరన్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్, ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా ఉండటం గమనార్హం. ఇద్దరు కూడా మళ్ళీ తిరిగి జట్టులోకి పునరాగమనం చేశారు. అయితే జూన్ లో ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికయ్యాడు ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్. కానీ చేతి వేలి గాయం కారణంగా జట్టు నుంచి తప్పుకున్నాడు.. అయితే ఇటీవలే ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ లో కూడా ఇద్దరు ఆటగాళ్లు పాల్గొనకపోవడం గమనార్హం. అయినప్పటికీ తమిళనాడు జట్టు అద్భుతంగా రాణించి కర్ణాటకపై ఫైనల్  లో విన్ అయ్యి ట్రోఫీ గెలుచుకుంది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ లో అందుబాటులో లేని ఇద్దరు ఆటగాళ్ళు ఇక ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీ లో మాత్రం అందుబాటులోకి వచ్చి మళ్లీ జట్టులోకి పునరాగమనం చేయడం గమనార్హం.  విజయ్ హజారే ట్రోఫీ డిసెంబర్ 8వ తేదీ నుంచి ప్రారంభం కాబోతోంది. దీంతో ఇక ప్రస్తుతం తమిళనాడు జట్టు ప్రదర్శనపై ఒక రేంజిలో అంచనాలు పెరిగిపోయాయి.


 తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ప్రకటించిన జట్టు వివరాలు ఇలా ఉన్నాయి: విజయ్ శంకర్ (కెప్టెన్‌), ఎన్ జగదీశన్, దినేష్ కార్తీక్, సి హరి నిశాంత్, ఎం షారుక్ ఖాన్, ఆర్ సాయి కిషోర్, ఎం అశ్విన్, సందీప్ వారియర్, ఎంఎస్ వాషింగ్టన్ సుందర్, ఎం సిద్ధార్థ్, బి సాయి సుదర్శన్, వి గంగా శ్రీధర్ రాజు, ఎం మహమ్మద్, జె కౌసిక్, పి శరవణ కుమార్, ఎల్ సూర్యప్రకాష్, బి ఇంద్రజిత్, ఆర్ సంజయ్ యాదవ్, ఎం కౌశిక్ గాంధీ, ఆర్ సిలంబరసన్

మరింత సమాచారం తెలుసుకోండి: