ఇండియాలో క్రికెట్ కు ఉన్న అభిమానం మరియు ఆదరణ ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఏ ఫార్మాట్ లో మ్యాచ్ జరిగినా స్టేడియం కి వచ్చి ఇండియాను సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇండియన్ క్రికెట్ చరిత్రలో ఎందరో గొప్ప గొప్ప ప్లేయర్స్ ప్రేక్షకుల మెప్పును పొందారు. ఇదిలా ఉంటే భారత్ క్రికెట్ లో యువరాజ్ సింగ్ శకమే వేరు. యువరాజ్ ఆడే ప్రతి ఒక్క షాట్ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. తన కెరీర్ లో ఎన్నో అద్బుతమయిన ఇన్నింగ్స్ ఆడి భారత్ కు విజయాలను అందించాడు. ప్రేక్షకులు కూడా మళ్ళీ అటువంటి ఆటగాడిని చూడగలమా అనుకుంటూ రోజులు గడిపారు. మధ్యలో ఎందరో లెఫ్ట్ హ్యాండర్స్ ఇండియన్ క్రికెట్ లో వచ్చి కనుమరుగైపోయారు.

కానీ యువరాజ్ సింగ్ ను మరిపించలేకపోయారు. కానీ ఇప్పుడు ఇండియన్ అండర్ 19 క్రికెట్ లో ఒక ఆటగాడిని చూస్తే అచ్చం యువరాజ్ సింగ్ లానే ఆడుతున్నాడు. ఇందుకు సాక్ష్యమే నిన్న ఉగాండాతో జరిగిన అండర్ 19 వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ . ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియన్ టీమ్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్ లో ఇద్దరు యువ ఆటగాళ్లు సెంచరీలు చేయడం విశేషం.  మొదట ఓపెనింగ్ బ్యాట్స్మన్ రఘువంశీ కేవలం 120 బంతుల్లో 144 పరుగులు చేయగా, సెకండ్ డౌన్ గా క్రీజులోకి వచ్చిన రాజ్ భవా 108 బంతుల్లోనే 162 పరుగులు చేసి శిఖర్ ధావన్ పేరిట ఉన్న అత్యధిక స్కోర్ రికార్డును అధిగమించాడు.

ఇతని ఇన్నింగ్స్ లో 14 ఫోరులు మరియు 8 సిక్సర్లు ఉన్నాయి.  స్టేడియం కు అన్ని వైపులా షాట్ లు ఆడుతూ అలనాటి యువరాజ్ సింగ్ ను గుర్తుకు తెచ్చాడు. యువరాజ్ లాగే అలవోకగా సిక్సర్ లు కొడుతున్నాడు. దీనితో టీమిండియాకు యువరాజ్ సింగ్ దొరికాడని సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారు. మరి ఇతను ఇలాగే రాణించి త్వరలోనే ఇండియన్ క్రికెట్ టీమ్ లో ఆడాలని యువరాజ్ సింగ్ లాగా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: