ఒక అద్భుతమైన ఆట తీరుతో ఎన్నో రికార్డులు కొల్లగొడుతున్నాడు. దిగ్గజ క్రికెటర్ లు సాధించిన రికార్డులను తక్కువ సమయంలోనే బద్దలు కొడుతున్నాడు విరాట్ కోహ్లీ. ఇక ప్రపంచ క్రికెట్లో రికార్డుల రారాజు గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ ఇటీవల కాలంలో పేలవమైన ఫామ్ తో తెగ ఇబ్బందులు పడుతున్నాడు. ఏ మ్యాచ్ లో కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. ఇక ఇటీవల జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో కేవలం 8 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు విరాట్ కోహ్లీ. ఇప్పుడు రెండో వన్డే మ్యాచ్లో కూడా విరాట్ కోహ్లీ అదే నిర్లక్ష్యం కనబరిచాడు అన్నది తెలుస్తుంది. తన పేలవమైన బ్యాటింగ్ తో మరోసారి నిరాశ పరిచాడు. తన రెండవ వన్డే మ్యాచ్ లో కేవలం 18 పరుగులు మాత్రమే చేసి వికెట్లు చేజార్చుకున్నాడూ.
12 వ ఓవర్లో రెండవ బంతిని బౌండరీ కి తరలించి ఎంతో ఊపు మీద కనిపించిన విరాట్ కోహ్లీ ఇక ఆ తర్వాత కొద్దిసేపటికే అవసరమైన షాట్ ఆడి చివరికి మూల్యం చెల్లించుకున్నాడూ. ఇక తనకు ఎంతో ప్రతిష్టాత్మకమైన 100 వన్డే మ్యాచ్లో చెత్త ప్రదర్శన చేయడంతో అభిమానులు అందరూ కూడా నిరాశలో మునిగిపోతున్నారు. ఇదిగో రాణిస్తాడు అదిగో రాణిస్తాడు అని అభిమానుల్లో ఆశలు పెట్టుకోవడం తప్పా రికార్డుల రారాజు గా పేరు తెచ్చుకున్న కోహ్లీ మాత్రం మళ్లీ మునుపటి ఫామ్ అందుకోలేక పోతున్నాడు అనే చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి