అయితే వన్డే సిరీస్లో క్లీన్ స్వీప్ కి గురై నిరాశపరిచిన వెస్టిండీస్ జట్టు టి-20 సిరీస్ లో అయినా సరే సత్తా చాటాలని అనుకుంది. కనీస పోటీ ఇవ్వాలని భావించింది. కానీ రోహిత్ సేన ముందు అటు వెస్టిండీస్ జట్టు చేతులెత్తియ్యాల్సిన పరిస్థితులు వచ్చాయి. వరుసగా రెండు టి20 మ్యాచ్ లలో కూడా టీమిండియా అద్భుత ప్రదర్శన చేయడంతో మంచి విజయాలను ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు టీ20 సిరీస్ లో భాగంగా 2-0 తేడాతో ఆధిక్యాన్ని కొనసాగిస్తుంది టీమిండియా జట్టు. ఈ నేపథ్యంలోనే కనీసం చివరి టి 20 మ్యాచ్ లో అయినా సరే గెలిచి పరువు నిలబెట్టుకోవాలని వెస్టిండీస్ ప్లాన్ చేస్తోంది.
కాగా ఇప్పటికే రెండు మ్యాచ్లలో విజయం సాధించి టీ20 సిరీస్ కైవసం చేసుకున్న భారత్ నేడు జరగబోయే చివరి మ్యాచ్లో కూడా గెలిచి మరోసారి వెస్టిండీస్ను క్లీన్ స్వీప్ చేయాలి అని భావిస్తోంది. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. మూడవ టీ20 మ్యాచ్లో విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ లకు విశ్రాంతి ఇచ్చారు. ఇక వారి స్థానంలో శ్రేయాస్ అయ్యర్ రుతురాజ్ గైక్వాడ్ లను తుది జట్టులోకి తీసుకున్నారు. మరి టీమిండియా గెలిచి మరోసారి వైట్ వాష్ చేస్తుందా.. లేక చివరి మ్యాచ్లో గెలిచి వెస్టిండీస్ పరువు నిలబెట్టుకుంటుందా అన్నది చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి