ఐపీఎల్ ప్రారంభమైంది.. ప్రతి మ్యాచ్లో కూడా ప్రేక్షకులకు సూపర్ ఎంటర్టైన్మెంట్ అందుతోంది. ఇక అంతకుమించి అనే రేంజ్ లోనే ఉత్కంఠభరితంగా ప్రతీ మ్యాచ్ జరుగుతూ ఉంది. ఇక ప్రతి మ్యాచ్లో కూడా భారీ స్కోర్లు చేస్తూ ఉండడంతో ఇక భారీ స్కోరును మరో జట్టు ఎంతో అలవోకగా ఛేదించడం లాంటివి జరుగుతుంది.  ఇకపోతే మ్యాచ్ మొత్తం ఒక ఎత్తు అయితే ఇక చివరి 19, 20 ఓవర్లలో బ్యాట్స్మెన్లు సృష్టించిన విధ్వంసం మరో రేంజ్ లో ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అప్పటివరకు వికెట్ కాపాడుకుంటూ ఎంతో నిలకడగా ఆడిన ఆటగాళ్లు ఇక చివరి ఓవర్ లలో మాత్రం వికెట్ పోయినా పర్వాలేదు కానీ సిక్సర్లు ఫోర్లు కొట్టాల్సిందే  అంటు డిసైడ్ అయి పోతూ ఉంటారు.


 దీంతో చివరి ఓవర్లలో భారీ స్కోర్లు నమోదు అవుతూ ఉంటాయి. అందుకే చివరి ఓవర్ను డెత్ ఓవర్లు  అని కూడా పిలుస్తు  ఉంటారు. సిక్సర్లు ఫోర్లు కొట్టడానికి సిద్ధమైన బ్యాట్స్మెన్ లను తన అరుదైన బంతులతో కట్టడి చేయడం కూడా అటు బౌలర్లు కు పెద్ద సవాల్తో కూడుకున్నది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇక చివరి ఓవర్లలో ధన ధన పాట ఫట్ అనే రేంజ్ లో సిక్సర్  ఫోర్లతో చెలరేగి పోవాలి అంటే అది కూడా మామూలు విషయం కాదు. కేవలం కొంతమందికి మాత్రమే అది సాధ్యం అవుతూ ఉంటుంది. మరి ఇప్పటి వరకు ఐపీఎల్ సీజన్ లో చివరి 20 ఓవర్లలో  సిక్సర్లతో భారీ పరుగులు చేసిన ఆటగాళ్లు ఎవరు ఇప్పుడు తెలుసుకుందాం.



 సూపర్ ఫినిషర్ గా పేరు సంపాదించుకున్న మహేంద్రసింగ్ ధోని  20 ఓవర్ లో 50 సార్లు కొట్టి ఇక టాప్ ప్లేస్లో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత కీరన్ పొలార్డ్ 30 సిక్సర్లు కొట్టి ప్రస్తుతం రెండవ స్థానంలో ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 23 సిక్సర్లతో మూడవ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఇరవై మూడు సిక్సర్లు కొట్టి నాలుగవ స్థానంలో ఉన్నాడు. ఇక రోహిత్ శర్మ ఇరవై మూడు సిక్సర్లతో ఐదవ స్థానంలో కొనసాగుతూ ఉండటం గమనార్హం.  ఏమి డివిలియర్స్ 19 సిక్సర్లతో ఆరవ స్థానంలో ఉన్నాడు. ఇలా ఈ ఆరుగురు స్టార్ క్రికెటర్లు కూడా 20 ఓవర్లో ఎక్కువ సిక్సర్లు కొట్టిన బ్యాట్స్మెన్ గా కొనసాగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: