భారత క్రికెట్ చరిత్రలో ఎంతోమంది కెప్టెన్లు ఉన్నప్పటికీ అటు మహేంద్రసింగ్ ధోని కి మాత్రం ప్రత్యేకమైన స్థానం ఉంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఏ కెప్టెన్ కు సాధ్యం కాని రీతిలో టీమిండియాకు 3 ఐసీసీ ట్రోఫీ లు సాధించి పెట్టాడు మహేంద్రసింగ్ ధోని. ఇక తన అద్భుతమైన కెప్టెన్సీ తో టీమిండియాకు ఎన్నో మరపురాని విజయాలను కూడా అందించాడు. అందుకే ఎంతో మంది కెప్టెన్లు ఉన్న ధోని కి మాత్రం ప్రత్యేక స్థానం ఎప్పటికీ ఉంటుంది. ప్రస్తుతం ధోని అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు అని చెప్పాలి.


 మరీ ముఖ్యంగా 2011లో మహేంద్ర సింగ్ ధోనీ టీమిండియాకు వన్డే వరల్డ్ కప్ అందించిన క్షణాలు ఇప్పటికీ మరిచిపోలేరు ఎవరు. ప్రతి ఏటా ఇక ఈ వరల్డ్ కప్ విజయాన్ని గురించి గుర్తు చేసుకుంటూ అప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఉంటారు. అప్పుడు వరల్డ్ కప్ లో భాగమైన క్రికెట్ ప్లేయర్స్,  ప్రేక్షకులు. ఇటీవలే ఇక 2011 వరల్డ్ కప్ గురించి మాట్లాడిన టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ధోనీ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా వరల్డ్ కప్ గెలిస్తే ఆస్ట్రేలియా వరల్డ్ కప్ గెలిచింది అని అంటారు అందరు.


 అదే టీమ్ ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే మాత్రం మహేంద్ర సింగ్ ధోనీ వరల్డ్ కప్ గెలిపించాడు అని అంటారు. మహేంద్ర సింగ్ ధోనీ ఒక్కడే వరల్డ్ కప్ గెలిస్తే జట్టులో ఉన్న మిగిలిన పది మంది ఆటగాళ్లు ఏం చేశారు. ఇక వరల్డ్ కప్ విజయంలో కీలకంగా వ్యవహరించిన నేను, గౌతం గంభీర్, యువరాజ్ సింగ్, సహా మిగతా ఆటగాళ్లు అందరూ కూడా ధోని వరల్డ్ కప్ గెలుస్తూ ఉంటే లస్సి తాగడానికి వెళ్దామా... ఇది టీం గేమ్ అందరం కలిసి ఆడటం వల్ల వరల్డ్ కప్ గెలిచాము అంటూ ఇక వివాదాస్పద రీతిలో షాకింగ్ కామెంట్స్ చేశాడు హర్భజన్ సింగ్. ఏ ఒక్కరి వల్ల వరల్డ్ కప్ రాదని మొత్తం సమిష్టిగా రాణించినప్పుడు మాత్రమే వరల్డ్ కప్ గెలుస్తామని షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇక హర్భజన్ వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయాయ్..

మరింత సమాచారం తెలుసుకోండి: