పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ ప్రస్తుతం కౌంటీ క్రికెట్ ఆడుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. వరుస మ్యాచ్లతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే మూడో రోజు ఆట లో భాగంగా గ్లూస్టార్ షైర్ బ్యాటర్ జేమ్స్ బ్రెసి ని క్లీన్ బౌల్డ్ చేశాడు పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ. బంతిని 150 కిలోమీటర్ల వేగంతో విసిరాడు. అది కూడా యార్కర్ సందించడంతో చివరికి బ్యాట్స్మెన్ దగ్గర ఈ బంతికి సమాధానం లేకుండా పోయింది. ఏకంగా బ్యాట్స్మెన్ కాళ్ళ సందులో నుంచి వెళ్లిన బంతి ఏకంగా మిడిల్ స్టంప్ ను ఎగగొట్టింది.
బంతి సూపర్ ఫాస్ట్ గా వెళ్ళి నేరుగా వికెట్కు తగలడంతో ఇక మిడిల్ స్టంప్ రెండు ముక్కలు అయింది. ఇక ఈ వీడియోను లంక షేర్ తమ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. కొత్త స్టంప్ ప్లీజ్ చెప్పడానికి ఏం లేదు ఓ మై గాడ్ మేము ఇంకో స్టంప్ తెచ్చుకోవాల్సిందే అంటూ ఒక క్యాప్షన్ జత చేసింది. అయితే లంక షైర్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు పాకిస్తాన్ బౌలర్ హసన్ అలీ. ఈ క్రమంలోనే ఇటీవల గ్లూస్టార్ షైర్ తో జరిగిన తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్ల పడగొట్టి అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఇక హసన్ అలీ బౌలింగ్ వేగాన్ని చూసి ప్రస్తుతం క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు అని చెప్పాలి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి