మరికొన్ని రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగియ బోతోంది. దీంతో ఐపీఎల్ లో సహచరులూగా ఉన్న ఆటగాళ్లు మళ్లీ ప్రత్యర్థులుగా మారబోతున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగియగానే భారత జట్టు దక్షిణాఫ్రికా తో టి 20 సిరీస్ ఆడబోతున్న విషయం తెలిసిందే. ఇక దీని కోసం భారత్ పర్యటనకు రాబోతుంది సౌతాఫ్రికా జట్టు. జూన్ 9వ తేదీన ఇక ఈ టి 20 సిరీస్ ప్రారంభం కానుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా టి20 సిరీస్ ప్రారంభమవుతుంది. సిరీస్ ముగియగానే అటు ఐర్లాండ్ ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్ళబోతుంది టీమిండియా. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది.


 టీమిండియా లో కీలక ఆటగాళ్లు గా కొనసాగుతున్న వారు గాయాల బారిన పడటమే ప్రస్తుతం టీమిండియాకు ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. ఇప్పటికే యువ పేసర్ హాస్టల్ పటేల్ గాయం బారిన పడ్డాడు. ఐపీఎల్ లో బెంగళూరు  జట్టుకు దూరమయ్యాడు.  కేవలం ఒక ఓవర్ వేసి నుంచి మైదానం బయటికి వెళ్లాడు. అతని గాయం పై ఇప్పుడు వరకు స్పష్టత లేదు. నాలుగు వారాల సమయం పట్టే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. దీంతో సౌత్ ఆఫ్రికా టి20 సిరీస్కు  అందుబాటులో ఉండటం అనుమానంగానే కనిపిస్తోంది.


 మరోవైపు స్టార్ ప్లేయర్ దీపక్ చాహర్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కీలక బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్, అజింక్య రహానే గాయాల తో బాధపడుతూ ఐపీఎల్లో జట్లకు దూరమయ్యారు. ఇక ఇదే సమయంలో టీమిండియా అప్కమింగ్ మూడు సిరీస్ల కోసం మూడు వేరు వేరు జట్లను ఎంపిక చేసేందుకు చేతన్ శర్మ సారథ్యంలోని కమిటీ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఇక సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వడం గురించి కూడా చర్చించనున్నారు. కాగా ప్రస్తుతం ఎంతో మంది స్టార్ ప్లేయర్ గాయాల బారినపడి కోలూకుంటున్న నేపథ్యంలో తుది జట్టు ఎంపిక విషయంలో ఎలాంటి వ్యూహాలు అమలు చేయబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది..

మరింత సమాచారం తెలుసుకోండి: