సీనియర్ క్రికెటర్ దినేశ్ కార్తీక్ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టడంపై అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారో ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు. గత కొంత కాలం నుంచి టీమిండియాకు పూర్తిగా దూరమై పోయిన దినేష్ కార్తీక్ టీమిండియా లో మళ్లీ అవకాశం దక్కించుకునేందుకు ఎంతగానో ప్రయత్నాలు చేశాడు. ఇలాంటి సమయం లోనే అతని కెరీర్ ముగిసి పోయింది అంటూ ఎంతో మంది విమర్శలు కూడా చేశారు. కానీ దినేష్ కార్తీక్ మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిలా తనలో ఉన్న సత్తా నిరూపించుకోవాలని భావించాడు.


 ఈ క్రమంలోనే తీవ్రం గా శ్రమించి ఇటీవల ఐపీఎల్లో అద్భుతమైన ఫినిషర్ గా కనిపించి సెలక్టర్ల  చూపును ఆకర్షించాడు. దీంతో సౌత్ ఆఫ్రికా తో టీమిండియా ఆడుతున్న టి20 సిరీస్ లో అవకాశం దక్కించుకున్నాడు అనే విషయం తెలిసిందే. ఇలా మూడేళ్ల తర్వాత మళ్లీ టీమిండియాలో అవకాశం తగ్గించుకోవడంతో ఇటీవలే సోషల్ మీడియా వేదికగా స్పందించాడు దినేష్ కార్తీక్. ఇండియాలో స్థానం దక్కించుకునేందుకు నిరంతరం కష్టపడ్డాను అంటూ చెప్పుకొచ్చాడు. 2019లో వన్డే ప్రపంచకప్ సెమీస్లో అనూహ్యంగా చోటు దక్కించుకున్న ఈ సీనియర్ ప్లేయర్ పేలవ  ప్రదర్శన చేయడంతో జట్టుకు దూరమయ్యాడు.


 అయితే గత మూడేళ్లుగా టీమిండియా లో ఏం జరుగుతుంది అన్న విషయాన్ని బయట నుంచి గమనిస్తూనే ఉన్నాడు. ఇక టీమిండియా తో కలిసి ఉంటే ఎప్పుడు ప్రత్యేకమైన ఫీలింగ్ ఉంటుంది. ఇక ఇప్పుడు టీమిండియా తో ఉన్న ప్రతి నిమిషాన్ని కూడా ఆస్వాదిస్తున్నాను. ప్రతి రోజు నేను మళ్ళీ టీమిండియాకు ఆడాలని.. మళ్లీ బ్లూ జెర్సీ ధరించాలనే కసితో రగిలి పోయే వాడిని అదే గత పదేళ్ల నుంచి నన్ను ముందుకు నడిపిస్తుంది అంటూ దినేష్ కార్తీక్ చెప్పుకొచ్చాడు. కాగా దినేష్ కార్తీక్  టీమిండియా తరఫున బరిలోకి దిగినప్పటికీ ఎందుకొ పెద్దగా ఆకట్టుకోలేక పోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: