వాస్తవంగా రఫెల్ నాదల్ క్వార్టర్ ఫైనల్ లో తన ప్రత్యర్థి టేలర్ ఫ్రిడ్జ్ తో తలపడి అతి కష్టం మీద సెమీస్ కు చేరుకున్నాడు. అయితే ఈ టోర్నీ కన్నా ముందు నుండి నాదల్ పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నాడు. అయినా కానీ చికిత్స తీసుకుని మ్యాచ్ లో పాల్గొన్నాడు. కానీ క్వార్టర్స్ లో ఎక్కువగా కష్టపడడం తో గాయం తీవ్రత ఎక్కువ అయింది. ఇక తట్టుకోలేని స్థితిలో సెమీస్ ఆడకుండానే వైదొలిగాడు. దీనితో సెమీస్ కు చేరుకున్న మరో క్రీడాకారుడు నిక్ కిర్గియోస్ సెమీస్ ఆడకుండా డైరెక్ట్ గా ఫైనల్ కు చేరుకున్నాడు.
అలా కాకుండా ఒకవేళ నాదల్ కనుక సెమీస్ ఆడి ఉంటే ఆ సంవత్సరం తను ఉన్న ఫామ్ కి ఖచ్చితంగా ఫైనల్ కు చేరి జోకోవిచ్ తో తలపడేవాడు. ఇక ఫైనల్ లో జోకో ఆడిన తీరు చూస్తే నాదల్ ను ఎదుర్కోవడం చాలా కష్టమయ్యేది. ఆ విధంగా నాదల్ కు దక్కాల్సిన ట్రోపీ ని జోకర్ గా పిలవబడే జోకొవిచ్ ఎత్తుకెళ్లాడు. మరి త్వరలోనే నాదల్ గాయం నుండి కోలుకుని మరిన్ని టైటిల్ లను అందుకోవాలని కోరుకుందాం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి