అంతే కాదు వన్డేల్లో 150 వికెట్లు పడగొట్టి అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు మహమ్మద్ షమీ. అంతేకాదు ప్రపంచ క్రికెట్ లోనే అత్యంత వేగంగా 150 వికెట్ల మార్కును అందుకున్న మూడో బౌలర్గా కూడా షమి తన ఖాతాలో మరో రికార్డు వేసుకున్నాడు. కేవలం 77 మ్యాచ్లో 150 వికెట్లు తీసి ఈ లిస్టులో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. అదే సమయంలో 78 మ్యాచ్లలో 150 వికెట్లు తీసి పాకిస్తాన్ బోర్డర్ ముస్తాక్ రెండో ప్లేస్లో ఉన్నాడు. ఇక్కడ 80 మ్యాచ్ లలో ఈ ఘనత సాధించిన రషీద్ ఖాన్ ప్రస్తుతం ఈ లిస్టు లో మూడవ స్థానంలో కొనసాగుతుండగా మహ్మద్ షమి కూడా 80 మ్యాచ్ లలోనే 150 వికెట్లు తీసి రషీద్ ఖాన్ తో పాటు మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
అంతేకాదు ఇక భారత జట్టు తరఫున ఏకంగా వేగంగా 150 వికెట్లు తీసిన తొలి బౌలర్గా మొహమ్మద్ షమీ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు అని చెప్పాలి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే భారత బౌలింగ్ విభాగం విజృంభించడంతో అటు ఇంగ్లాండ్ బ్యాటింగ్ విభాగం మొత్తం పేకమేడలా కూలిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే 111 పరుగులకు ఆలవుట్ అయ్యింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా జట్టు ఒక వికెట్ కూడా కోల్పోకుండానే 18.4 ఓవర్లలో టార్గెట్ చేధించింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి