ఈ క్రమంలోనే శ్రీలంక ప్రజలందరూ కూడా తీవ్ర అవస్థలు పడుతున్నారు. కేవలం సామాన్యుల మాత్రమే కాదు సెలబ్రిటీలకు సైతం ఇబ్బందులు తప్పడం లేదు అన్నది తెలుస్తుంది. అయితే శ్రీలంక వేదికగా ఆగస్టులో ప్రతిష్టాత్మకమైన ఆసియా కప్ నిర్వహించాల్సి ఉంది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఆసియా కప్ కు శ్రీలంక ఆతిథ్యం వహించగలదా లేదా అన్నది గత కొన్ని రోజుల నుండి జరుగుతున్న చర్చ. అయితే ఇప్పటి వరకు పలు దేశాల జట్లు శ్రీలంక పర్యటనకు వెళ్లి ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగానే పూర్తి చేసుకుంటూన్న నేపథ్యంలో ఇక ఆసియా కప్ కూడా శ్రీలంక వేదికగా జరుగుతుంది అని అందరూ అనుకున్నారు.
ఇటీవల ఇదే విషయంపై శ్రీలంక క్రికెట్ బోర్డు స్పందిస్తూ షాకింగ్ ప్రకటన చేసింది. ఆసియా కప్ క్రికెట్ టోర్నీ తమ దేశంలో నిర్వహించలేమని అంటూ ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక రాజకీయ సంక్షోభం కారణంగా విదేశీ మారక ద్రవ్యం సమస్యగా మారిందని.. ఇలాంటి సమయంలో టోర్నీ నిర్వహించడం సాధ్యం కాదని లంక క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. ఆతిథ్య హక్కులు తమకే ఉండడంతో యూఏఈ లేదా మరేదైనా దేశంలో దీంతో టోర్నీ నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. కాగా ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో ఆసియా కప్ జరగాల్సి ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి