సాధారణంగా టీ20 ఫార్మాట్ లో బ్యాట్స్మెన్లు సృష్టించే విధ్వంసం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రీజు లోకి వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్  కూడా సిక్సర్లు, ఫోర్లతో చెలరేగి పోతుంటాడు. బౌలర్లతో చెడుగుడు ఆడేస్తూ ఉంటాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక బ్యాట్స్మెన్లు మెరుపు  బ్యాటింగ్ చేస్తున్న నేపథ్యంలో అటు స్కోర్ బోర్డు కూడా పరుగులు పెడుతూ ఉంటుంది. అయితే ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్మన్ క్రీజు లో ఉన్నప్పుడు ఇక బౌలింగ్ చేసేది ప్రపంచంలోనే నెంబర్వన్ బౌలర్ అయినప్పుడు బంతి బ్యాట్ కి  మధ్య ఎంత హోరాహోరీ పోరు జరుగుతూ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.


 ఇక టి20 ఫార్మాట్లో చివరి ఓవర్లలో భారీగా పరుగులు చేయడం  ఎంతో ఒత్తిడితో కూడుకున్నది. కేవలం కొంతమంది అత్యుత్తమ బ్యాట్స్ మెన్ లకు మాత్రమే భారీగా పరుగులు చేసేందుకు అవకాశం ఉంటుంది. కానీ కొన్ని కొన్ని సార్లు ప్రేక్షకులందరినీ కూడా ఒకసారిగా సర్ప్రైస్ చేస్తూ బౌలర్లు రెచ్చిపోయి  ఆడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఇంగ్లాండ్లో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ప్రపంచంలోనే అత్యంత బౌలర్గా పేరు సంపాదించుకున్న జస్ప్రిత్ బూమ్రా ఒకే ఓవర్లో 33 పరుగులు చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇక ఇప్పుడు ఇలాగే ఒక బౌలర్ తన బ్యాటింగ్తో  అదరగొట్టాడు.


 ప్రస్తుతం మహిళల క్రికెట్ లో ప్రపంచ నెంబర్వన్ టి20 బౌలర్గా కొనసాగుతోంది సోఫీ ఎక్లే స్టోన్. ఇటీవలే బంతి తోనే కాదు బ్యాట్ తో కూడా సత్తా చాటింది అని చెప్పాలి. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టి20 మ్యాచ్ లో కేవలం 12 బంతుల్లోనే 33 పరుగులతో మెరుపు బ్యాటింగ్ చేసింది. తన జట్టుకు విజయాన్ని అందించింది. ప్రపంచ నెంబర్వన్ బౌలర్ తన బ్యాటింగ్ తో చివరి ఓవర్లో 26 పరుగులు రాబట్టింది. తద్వారా మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 20 ఓవర్లలో 176 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది.


 ఆ తర్వాత లక్ష్య ఛేదనకు జరిగిన సౌత్ ఆఫ్రికా జట్టు చేతులెత్తేసింది. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ జట్టు 38 పరుగుల తేడాతో విజయం సాధించింది అని చెప్పాలి. ఈ విజయం కారణంగా 3-0 తేడాతో సౌతాఫ్రికా క్లీన్స్వీప్ చేసింది ఇంగ్లాండ్ జట్టు. అయితే ఇక ఈ మ్యాచ్ మొత్తానికి 20 ఓవర్ లో బౌలర్ సోఫి ఆడిన మెరుపు ఇన్నింగ్స్ మ్యాచ్ మొత్తానికి హైలెట్ గా మారిపోయింది అని చెప్పాలి. ఒకవేళ చివరి ఓవర్లో బౌలర్ అద్భుతంగా ఆడి ఉండకపోయి ఉంటే ఇంగ్లాండ్ జట్టు చివరికి ఓటమి చవి చూసేది అని చెప్పాలి. .

మరింత సమాచారం తెలుసుకోండి: