2018లో జరిగిన కాఫీ విత్ కరణ్ సీజన్ సిక్స్ సందర్భంగా సెక్స్ లైఫ్ గురించి కేఎల్ రాహుల్, హార్థిక్ పాండ్యా లు సెటైరికల్ సమాధానాలు చెప్పారు. ఇది పెద్ద సంచలనంగా మారిపోవడంతో వీరిద్దరిపై ఏకంగా రెండేళ్ల పాటు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. అంతేకాదు ఇదే విషయంపై డాక్టర్ మేఘ్ వాల్ కరణ్ జోహార్ సహా హార్దిక్ పాండ్యా కె.ఎల్.రాహుల్ లపై జోద్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇక వీరిపై నిషేధం పూర్తయింది కానీ గత మూడేళ్ళ నుంచి ఇదే కేసుపై విచారణ జరుగుతుంది అని చెప్పాలి.
ఈ క్రమంలోనే ఇటీవలే విచారణ ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో ఇద్దరు స్టార్ క్రికెటర్లకు ప్రస్తుతం ఊరట లభించింది. ఈ ముగ్గురు ఉద్దేశపూర్వకంగా మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయలేదు అని భావించిన న్యాయస్థానం చివరికి ఈ కేసును కొట్టివేసింది. దీంతో ఇక హార్దిక్ పాండ్యా కె.ఎల్.రాహుల్ ప్రస్తుతం నిర్దోషులుగా తేలారు అని చెప్పాలి. అయితే ప్రస్తుతం ఈ ఇద్దరు ఆటగాళ్ళు కూడా టీమిండియాలో కీలక ప్లేయర్ లూగా కొనసాగుతున్నారు అన్న విషయం తెలిసిందే హార్దిక్ పాండ్యా టీమిండియాతో కలిసి వెస్టిండీస్ పర్యటనకు వెళ్తే.. కేఎల్ రాహుల్ కరోనా వైరస్ నుంచి కోలుకుంటున్నాడు.