సాధారణంగా క్రికెట్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరిగిన సమయంలో కొంతమంది పేర్లు మెరుగు ఫీలింగు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే  అసాధ్యమనుకున్న క్యాచ్ ను ఎంతో అలవోకగా పట్టేసి అందరినీ అవాక్కయ్యేలా చేస్తుంటారూ. ఇక ఇలాంటి తరహా క్యాచ్ లు ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఒకవేళ మ్యాచ్ మొత్తంలో ఎవరైనా ఆటగాళ్లు ఇలా మెరుపు ఫీలింగ్ చేసి అదిరిపోయే క్యాచ్ పడితే అందుకు సంబంధించిన వీడియో కాదు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది. ఇక ప్రతి ఒక్కరు కూడా అద్భుతమైన క్యాచ్ గురించి చర్చించుకోవడం మొదలు పెడుతూ ఉంటారు. సాధారణంగా ఒక మ్యాచ్లో ఇలాంటి అద్భుతమైన క్యాచ్ లు ఒక్కటి పట్టడమే చాలా అరుదు. కానీ ఇక్కడ జరిగిన మ్యాచ్ లో మాత్రం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు అసాధ్యమైన క్యాచ్ లను అవలీలగా పట్టేశారు  ఆటగాళ్లు.  ఇందుకు సంబంధించిన వీడియోలు కాస్త ప్రస్తుతం ట్విట్టర్ వేదికగా తెగ చక్కెర్లు కొడుతున్నాయి.  ఇటీవలి కాలంలో వెస్టిండీస్ జట్టు వరుసగా పరాజయాలు చవి చూస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇటీవలే జమైకా లోని సబీనా పార్కులో న్యూజిలాండ్తో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో కూడా పరాజయం పాలైంది.జట్టు ఓటమి పాలు అయినప్పటికీ అటు వెస్టిండీస్ ఆటగాళ్ల ప్రదర్శన మాత్రం అందరినీ ఆకట్టుకుంది అని చెప్పాలి. వెస్టిండీస్ ఫీల్డర్లు  మూడు కళ్లు చెదిరే క్యాచ్ లు అందుకున్నారు. మొదట న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ ఆఫ్ సైడ్ కొట్టిన షాట్ ను బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న హెట్మెయర్   ఎంతో అలవోకగా గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో క్యాష్ పట్టుకున్నాడు. తర్వాత మరో ఓపెనర్ డీవన్ ' కాన్వే ఇచ్చిన క్యాచ్ ను  వికెట్ కీపర్ ఎంతో అలవోకగా క్యాచ్ అందుకున్నాడు. 18 ఓవర్ లో  విలియమ్సన్ ఆడిన షాట్ ను బౌండరీ లైన్ దగ్గర హెడెన్ వాల్ష్ మెరుపువేగంతో డైవ్ చేస్తూ క్యాచ్ అందుకున్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: