సాధారణం గా క్రికెట్ అన్న తర్వాత ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అయితే ఒకరికి ఒకరు ఎంతలా కవ్వించుకున్నప్పటికి కూడా అవి కేవలం మాటల యుద్ధం తోనే సరి పెట్టుకుంటూ ఉంటారు. ఎప్పుడో ఒక సారి ఎక్కువగా సీరియస్ అవుతూ ఒకరిమీద ఒకరు దూసుకు పోవడం  జరుగుతూ ఉంటుంది. అయితే ఇటీవలి కాలం లో ఎంతో మంది క్రికెటర్లు మాటల యుద్ధానికి దిగినప్పటికీ  ఎంతో హుందాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కానీ ఇటీవలే ఆసియా కప్లో భాగంగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఊహించని సంఘటనలు చోటు చేసుకున్నాయి.


 ఒకానొక సమయం లో పాకిస్తాన్ బ్యాట్స్మెన్ ఆసిఫ్ అలీ, ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ ఫరీద్ మహ్మద్ ఒకరినొకరు తోసుకుంటూ దారుణం గా కొట్టుకునేందుకు కూడా వెళ్లారు. ఇక ఇది ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు అవుతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే వీరిపై ఐసీసీ చర్యలు తీసుకోవాలి అంటూ ఎంతో మంది మాజీ క్రికెటర్లు కూడా సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు. ఈ క్రమం లోనే అటు ఐసీసీ ఇద్దరు ఆటగాళ్ల పై చర్యలకు సిద్ధమైంది అని తెలుస్తోంది.


 పాకిస్తాన్ బ్యాట్స్మెన్ ఆసిఫ్ అలీ ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ ఫరిద్ అహ్మద్ లకు మ్యాచ్ ఫీజు లో 25 శాతం జరిమానా విధించారు. ఇద్దరు కూడా ఐసీసీ ప్రవర్తనా నియమావళి కి సంబంధించిన నేరానికి పాల్పడ్డారు అంటూ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తెలిపింది. ఆసిఫ్ అలీ ఐసిసి ప్రవర్తనా నియమావళి లోని సెక్షన్ 2.6 ఉల్లంఘించాడని అంతర్జాతీయ మ్యాచ్ లో అసభ్యకరమైన అభ్యంతరకరమైన అవమానకరమైన సంజ్ఞల తో వ్యవహరించడం ఇందుకు వర్తిస్తుంది అంటూ తెలిపాడు. అదే సమయం లో ఫరిద్ అహ్మద్ కు సెక్షన్ 2 ఇవ్వబడింది.  ఏదైనా వ్యక్తిపై పరిష్కారం సరికాని శారీరక సంబంధానికి సంబంధించినది ఇందుకు వర్తిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: