గత కొన్ని రోజుల నుంచి టీమిండియా తరఫున వరుసగా మ్యాచ్ లు ఆడుతున్నాడు భువనేశ్వర్ కుమార్. మునుపటిలా తన గోలింతో మ్యాజిక్ చేయలేకపోతున్నాడు అని చెప్పాలి.. ఒకప్పుడు స్వింగ్ బౌలింగ్ తో బ్యాట్స్మెన్లను తికమక పెట్టి వికెట్లు పడగొట్టిన భువనేశ్వర్ కుమార్ ఇప్పుడు మాత్రం అదే రీతిలో ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ముఖ్యంగా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ గా పేరున్న భువనేశ్వర్ కుమార్ ఇక అదే డెత్ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకుంటూ ఉండటం గమనార్హం. ఆసియా కప్ లో ఆఫ్ఘనిస్తాన్ పై జరిగిన మ్యాచ్ మినహా మిగతా ఏ మ్యాచ్ లో కూడా ఇటీవల కాలంలో ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోయాడు భువనేశ్వర్ కుమార్.


 ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ లో కూడా  విఫలం అయ్యాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోని ఇటీవలే భువనేశ్వర్ కుమార్ ఫామ్ పై మాథ్యూ హెడెన్  స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సాధారణంగా బ్యాట్స్మెన్ల కంటే ఫాస్ట్ బౌలర్లు ఎక్కువగా అలసిపోతారు. ఇప్పుడు భువనేశ్వర్ కుమార్ కూడా ఇలాగే ఎక్కువ అలసిపోయినట్లు కనిపిస్తున్నాడు. నిన్నటి వరకు కోహ్లీ కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నాడు. కోహ్లీ కొన్నాళ్లపాటు విశ్రాంతి తీసుకొని మళ్ళీ జట్టులోకి చేరి రాణిస్తున్నాడు. ఇప్పుడు భువనేశ్వర్ కి కూడా విశ్రాంతి అవసరం. కొన్నాళ్లు విశ్రాంతి తీసుకుంటే అతను మళ్లీ చెలరేగుతాడు. ఎక్కువ అలసిపోతే అతను బంతిలో ఏకాగ్రత సాధించలేడు అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తాడు మాథ్యూ హెడెన్.


 భువనేశ్వర్ కుమార్ ఒక అద్భుతమైన బౌలర్..అతను కి విశ్రాంతి ఇస్తే తప్పకుండా మునుపటి ఫామ్ అందుకుంటాడు అన్న నమ్మకం నాకుంది. అయితే భారత జట్టులో జస్ట్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ జోడి ఎంతో కీలకం.. వీరిద్దరూ  జట్టు విజయంలో కీలక పాత్ర వహిస్తారు  అని నేను బలంగా నమ్ముతున్నాను. అందుకే భువనేశ్వర్ కుమార్ విషయంలో టీమిండియా ఇక విశ్రాంతి ఇస్తూ నిర్ణయం తీసుకోవడమే మంచిది అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: