
ఇక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఏకంగా మూడో వన్డే మ్యాచ్లో డబుల్ సెంచరీ తో చెలరేగిపోయాడు అని చెప్పాలి. 126 బంతుల్లోనే 200 పరుగులు చేసి.. ఇక క్రికెట్ ప్రపంచం చూపును మొత్తం తన వైపుకు తిప్పుకున్నాడు ఇషాన్ కిషన్. ఈ క్రమంలోనే వన్డే ఫార్మాట్లో డబుల్ సెంచరీ సాధించిన అతిపిన్న వయస్కుడిగా కూడా రికార్డు సృష్టించాడు. అంతేకాదు అత్యంత వేగంగా డబుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా అగ్రస్థానంలోకి చేరుకున్నాడు ఇషాన్ కిషన్. ఈ క్రమంలోనే అతని అద్భుతమైన బ్యాటింగ్ పైన ప్రస్తుతం అందరూ ప్రశంసల కురిపిస్తున్నారు అని చెప్పాలి.
ఇకపోతే ఇషాన్ కిషన్ చిన్నప్పటి ఫోటోని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన బీహార్ కు చెందిన ఒక జర్నలిస్ట్ ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇషాన్ కిషన్ ను చూస్తే గర్వంగా ఉంది అంటూ తెలిపాడు. అయితే క్రికెట్ నుంచి రాజకీయాలను వేరు చేయాలని అలా చేస్తే ప్రతి ఇంటి నుంచి ఒక ఎమ్మెస్ ధోని,,ఇషాన్ కిషన్ పుట్టుకొస్తారు అంటూ చెప్పుకొచ్చాడు. బీహార్ లో సౌకర్యాలు అసలు బాగాలేవని అందుకే కొత్తగా క్రికెటర్లు పుట్టుకు రావడం లేదు అంటూ చెప్పవచ్చాడు. కాగా బీహార్ నుంచి జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. దీంతో ధోని, ఇషాన్ కిషన్ రాష్ట్రం ఝార్ఖండ్ గా మారిపోయింది.