
అయితే ఇలా అన్ని జట్లు కూడా అద్భుతంగా రాణిస్తూ భారీగా పరుగులు చేస్తూ ఉంటే ఇక ఇటీవల రంజి ట్రోఫీలో భాగంగా నాగాలాండ్ జట్టు మాత్రం పేలవమైన ప్రదర్శన చేసి ఒక చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది. ఏకంగా రంజీ ట్రోఫీ చరిత్రలో భాగంగా అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్టుగా చెత్త రికార్డును సొంతం చేసుకుంది అని చెప్పాలి. ఇటీవలే ఉత్తరాఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నాగాలాండ్ జట్టు కేవలం 25 పరుగులకే ఆల్ అవుట్ అయింది అని చెప్పాలి. ఇక ఇది రంజి చరిత్రలోనే నాలుగవ అత్యల్ప స్కోరు కావడం గమనార్హం.
ఈ మ్యాచ్ లో భాగంగా ముందుగా బ్యాటింగ్ చేసిన ఉత్తరాఖండ్ జట్టు 199 పరుగులు చేసింది. ఈ క్రమంలోని రెండు వందల పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నాగాలాండ్ ఏ దశలో కూడా కనీస పోటీ ఇవ్వలేకపోయింది అని చెప్పాలి. కేవలం 25 పరుగులు మాత్రమే చేసి కుప్పకూలిపోయింది. మొత్తంగా 18 ఓవర్లు మాత్రమే ఆడింది అని చెప్పాలి. ఉత్తరాఖండ్ బౌలర్లు మయాంక్ మీశ్రా అద్భుతమైన బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. 9 ఓవర్లు వేసి నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇందులో 7 ఓవర్లు మెయిడిన్ ఉండడం గమనార్హం. ఇక మరోవైపు స్వప్నిల్ సింగ్ సైతం 9 ఓవర్లలో 21 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు చేశాడు. కాగా రంజీ ట్రోఫీ చరిత్రలో 2011 సీజన్లో రాజస్థాన్ లో జరిగిన మ్యాచ్‌లో 21 పరుగులకు ఆల్ అవుట్ అయిన హైదరాబాద్ జట్టు ఇక అత్యల్ప స్కోర్ చేసిన జట్టుగా మొదటి స్థానంలో ఉంది..