
ఆ విధంగా కావ్య పాప ఏదో ఒక విషయంలో నెట్టింట్లో ట్రెండింగ్ లోనే ఉంటుంది. అదే విధంగా తాజాగా మరొక్క విషయంలో ఈమె పేరు సోషల్ మీడియాలో మరు మ్రోగిపోతోంది. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా లో టీ 20 లీగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ లో లగే ఇక్కడ కూడా సన్ రైజర్స్ ఒక టీం ను కొనుగోలు చేసింది. ఆ టీం కు ఈస్టర్న్ కేప్ సన్ రైజర్స్ అన్న పేరును ఖరారు చేసింది. ఈ టీం కు సౌత్ ఆఫ్రికా ఆటగాడు ఐడెన్ మార్క్ రామ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. నిన్న రాత్రి పార్ల రాయల్స్ మరియు ఈస్టర్న్ కేప్ జట్లకు మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఈస్టర్న్ జట్టు 5 వికెట్ల తేడాతో రాయల్స్ పై విజయం సాధించింది. దీనితో సన్ రైజర్స్ జట్టు ఆడిన 5 మ్యాచ్ లలో మూడు గెలిచి పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో నిలిచింది.
అయితే ఈ మ్యాచ్ మధ్యలో ఈస్టర్న్ కేప్ సన్ రైజర్స్ జట్టుకు మద్దతు పలికే ఒక అభిమాని "కావ్య నన్ను పెళ్లి చేసుకుంటావా ? అన్న బోర్డు ను చూపిస్తూ కనిపించాడు. ఇది చూసిన నెటిజన్లు కావ్య మారన్ ను పెళ్లి చేసుకునే ఆ అందగాడు ఎవరా అంటూ ఆ ఫోటోను జత చేసి సోషల్ మీడియాలో కామెంట్ లు పెడుతున్నారు. మరి ఈ విషయం కావ్యా పాప వరకు వెళ్లిందా ? వెళితే ఆమె దీనిపై ఏ విధంగా స్పందించిందో తెలియాల్సి ఉంది.