టి20 ఫార్మాట్ అంటేనే ఎన్నో ఆసక్తికరమైన ఘటనలకు కేరాఫ్ అడ్రస్ అనే విషయం తెలిసిందే. అయితే అటు బౌలర్లు వికెట్ తీసేందుకు ఎంతో వైవిధ్యమైన బంతులు వేస్తూ ఉంటారు. అదే సమయంలో బ్యాట్స్మెన్లు అదిరిపోయే ప్రదర్శన చేసి సిక్సర్లు ఫోర్లతో  చెలరేగిపోతూ ఉంటారు. ఇలాంటి సమయంలో ఒక్కోసారి మైదానంలో ఫీల్డింగ్ చేస్తున్న ఫీల్డర్లు చేసే విన్యాసాలు కూడా అందరిని అబ్బురపరుస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఏకంగా క్యాచ్ పట్టే సమయంలో అయితే కొంతమంది ఫీల్డర్లు  ఏకంగా సూపర్ మాన్ లాగా మారిపోతూ ఉంటారు.



 అమాంతం గాల్లోకి ఎగురుతూ ఎంతో రిస్కీ విన్యాసాలు చేస్తూ క్యాచ్ ఒడిసి పట్టడం లాంటివి చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇలా ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఇలాంటి విన్యాసాలు ప్రతి మ్యాచ్ లో కూడా కనిపిస్తూ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ పంచుతూ ఉంటాయి. ఐపీఎల్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో కూడా ఇలాంటి ఒక ఆసక్తికర ఘటన జరిగింది అని చెప్పాలి. అప్పటికే వేలి గాయంతో బాధపడుతున్న మోహిత్ శర్మ వెనక్కి పరిగెడుతూ అద్భుతమైన డైవ్ చేసి  క్యాష్ అందుకున్నాడు.



 అయితే మంచి ఫామ్ లో ఉన్న శార్దూల్ ఠాగూర్ ఇక మంచి హిట్టింగ్ చేస్తాడు అని నమ్మకం ఉంచి బ్యాటింగ్లో అతనికి ప్రమోషన్ కల్పించింది కోల్కతా జట్టు. కానీ చివరికి ఈ ప్రయత్నం కాస్త విఫలం అయింది అని చెప్పాలి. మహమ్మద్ షమీ బౌలింగ్లో ఇన్నింగ్స్ ఐదో ఓవర్ నాలుగో బంతిని భారీ షాట్ ఆడెందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే మోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు అని చెప్పాలి. అయితే మోహిత్ శర్మ పట్టిన క్యాచ్ మ్యాచ్ మొత్తానికి హైలైట్ గా నిలిచింది. మిడ్ ఆన్ నుంచి వెనక్కి పరిగెత్తిన మోహిత్ శరీరాన్ని విల్లులా ఒంపి డైవ్ చేస్తూ అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. దీంతో శార్దూల్ ఠాగూర్ కథ ముగిసింది. అయితే 2021 క్వాలిఫైయర్ లో కూడా ఇలా శార్దూల్ ఠాగూర్ కి   బ్యాటింగ్లో ప్రమోషన్ ఇస్తే అప్పుడు కూడా డకౌట్ అయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: