
టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గా పేరు ఉన్న చట్టేశ్వర్ పూజార అటు ఇంగ్లాండ్ కౌంటీలలో అదరగొడుతున్నాడు. దీంతో ఇక ఇప్పుడు ఇంగ్లాండ్ లోని ఓవల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లలో చటేశ్వర పూజార అదిరిపోయే ప్రదర్శన చేస్తాడని అందరూ ఊహిస్తే.. ఊహించని రీతిలో వికెట్ కోల్పోయాడు ఈ టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్. ఇలా టాప్ఆర్డర్ బ్యాట్స్మెన్లు అందరూ కూడా తడబడ్డారు అని చెప్పాలి. అయితే ఇలా తక్కువ పరుగులకే టీమిండియా ఎక్కువ వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో రహానే నేనున్నాను అంటూ భరోసా ఇచ్చాడు. తన బ్యాటింగ్తో అదరగొట్టాడు అని చెప్పాలి.
మరోవైపు ఆల్రౌండర్ శార్దూల్ ఠాగూర్ కూడా అజింక్య రహానే కు మంచి తోడ్పాటు అందించి ఇక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు అని చెప్పాలి. ఇలా టాప్ ఆర్డర్ మొత్తం కుప్పకూలిపోయిన సమయంలో ఇద్దరు ముంబై కుర్రాళ్ళు మాత్రం అదిరిపోయే ప్రదర్శనతో అదరగొట్టాడు అంటూ క్రికెట్ వర్గాలు ప్రశంసిస్తున్నాయ్. రహానే, శార్దూల్ ఠాకూర్లు ఏకంగా సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. శార్దూల్ ఠాగూర్ 51 పరుగులు చేస్తే అటు అజింక్య రహనే 86 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. వేలికి గాయం అయినప్పటికీ నొప్పిని భరిస్తూనే ఇక జట్టు విజయం కోసం పోరాడాడు రహనే.