2011 వరల్డ్ కప్ విజయం తర్వాత ఇప్పుడు వరకు టీమిండియా ఒక్కసారి కూడా విశ్వవిజేతగా నిలవలేకపోయింది అని చెప్పాలి. అయితే ధోని తర్వాత విరాట్ కోహ్లీ కెప్టెన్సీ అందుకుని ఎన్నోసార్లు ఇక తన సారధ్యంలో వరల్డ్ కప్ లో బరిలోకి దిగినప్పటికీ టీమిండియా కు అటు విశ్వ విజేత అనే ఘనత మాత్రం దక్కలేదు. అయితే రోహిత్ కెప్టెన్సీలో అయినా ఇక టీమిండియా వరల్డ్ కప్ గెలుస్తుంది అనుకుంటే.. గత టి20 వరల్డ్ కప్ తో పాటు ఈ ఏడాది జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో కూడా టీమిండియాకు పరాజయం  తప్పలేదు అని చెప్పాలి.


 ఇంగ్లాండులోని ఓవల్ మైదానం వేదికగా జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది టీం ఇండియా జట్టు. ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించి విశ్వవిజేయతగా నిలుస్తుందని అందరూ ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. కానీ మొదటి రోజు నుంచి పేలవమైన ఫామ్ కొనసాగించింది టీమ్ ఇండియా. బౌలింగ్లో బ్యాటింగ్లో చేతులెత్తేసింది అని చెప్పాలి. ఒకవైపు ఆస్ట్రేలియా దుమ్ము దులిపేస్తున్న పిచ్ పై అటు టీమ్ ఇండియా మాత్రం పరుగులు కట్టడి చేయడానికి.. పరుగులు చేయడానికి ఆపసోపాలు పడింది అని చెప్పాలి.


 దీంతో వరుసగా రెండోసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయి నిరాశపరిచింది. కెప్టెన్ రోహిత్ శర్మను తొలగించాలి అంటూ డిమాండ్లు వస్తున్నాయి. ఇక ఇటీవల ఇదే విషయం గురించి ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ మైకల్ క్లార్క్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒక స్పోర్ట్స్ ఛానల్ తో మాట్లాడుతూ.. రోహిత్ చాలా మంచి కెప్టెన్. ఒక ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయినందుకు అతడిని టీమ్ ఇండియా కెప్టెన్ గా  సరైనోడు కాదు అని అనడం సమంజసం కాదు. భారత జట్టు రెండుసార్లు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు చేరుకుంది అంటే ఇక గత నాలుగేళ్ల నుంచి టీమిండియా ఎంత బాగా ఆడిందో అర్థం చేసుకోవచ్చు అంటూ మైకేల్ క్లార్క్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: