ప్రస్తుతం టీమిండియాలో యంగ్ క్రికెటర్ గా కొనసాగుతున్నాడు సంజూ శాంసన్ వికెట్ కీపర్ గా బ్యాట్స్మెన్ గా తనదైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా కొనసాగుతూ జట్టును ఎంతో విజయవంతంగా ముందుండి నడిపిస్తున్నాడు. ఇక ప్రతిసారి ఐపీఎల్లో తన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. అయితే ఇంత చేస్తున్న అతనికి టీం ఇండియాలో మాత్రం అసలు ఛాన్స్ రావట్లేదు.  ఐపీఎల్లో ఒక్క సీజన్లో రాణించిన ఆటగాళ్లు అటు వెంటనే టీమిండియాలోకి వచ్చి తుది జట్టులో చోటు దక్కించుకుంటూ ఉంటే.. అటు  సంజూ శాంసన్ ను మాత్రం సెలెక్టర్లు ప్రతిసారి పక్కన పెడుతూనే ఉన్నారు అని చెప్పాలి.


 దీంతో సంజు శాంసన్ విషయంలో సెలెక్టర్లు కావాలనే వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అంటూ అభిమానులు అందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఇదే విషయంపై ఏకంగా టీమిండియా కు నిరసన సెగ తగిలిన విషయం కూడా అసలు ప్రేక్షకులు మర్చిపోలేరు. అయితే కొన్ని కొన్ని సార్లు తూతూ మంత్రంగా  అతని జట్టులోకి తీసుకున్నప్పటికీ.. ఇక తుది జట్టులో మాత్రం చోటు కల్పించడం లేదు. ఒకవేళ తుది జట్టులోకి తీసుకున్న ఒకటి రెండు మ్యాచ్లకే పరిమితం చేస్తున్నారు అని చెప్పాలి. దీంతో సెలెక్టర్లు తీరుతో అభిమానులు అందరూ కూడా నిరాశలో మునిగిపోయారు.


 అయితే ఇటీవలే వెస్టిండీస్ పర్యటన కోసం సంజూ శాంసన్ ను మరోసారి సెలెక్ట్ చేశారు టీమిండియా యాజమాన్యం. దీంతో అభిమానులు అందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే వెస్టిండీస్ పర్యటనకు అయితే సెలెక్ట్ అయ్యాడు. కానీ అటు తుది జట్టులోకి మాత్రం అతను రాలేదు. దీంతో మరోసారి విమర్శలు వస్తున్నాయి. వన్డే వరల్డ్ కప్ నుంచి తప్పించుకుందుకే బీసీసీఐ ఇలా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. ఫేవరేటిజం తోనే సంజు కెరియర్ను ముంబై మాఫియా నాశనం చేస్తుందని చెప్పుకొచ్చారు. అయితే మిడిల్ ఆర్డర్లో ఇషాన్ కిషన్ సూర్యకుమార్ కంటే సంజూ శాంసన్ బెటర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: