ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో ఛాంపియన్  టీం ఏది అంటే ప్రతి ఒక్కరు కూడా గుక్క తిప్పుకోకుండా చెప్పేస్తారు అదేదో కాదు ధోని కెప్టెన్సీలో అదరగొడుతున్న చెన్నై సూపర్ కింగ్స్ అని. ఇప్పటివరకు అటు చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ హిస్టరీలో ఐదు సార్లు టైటిల్ విజేతగా నిలిచింది. అయితే అటు ముంబై ఇండియన్స్ కూడా చెన్నైతో సమానంగా ఐదుసార్లు టైటిల్ గెలిచింది. కానీ చెన్నై గణాంకాలు మాత్రం ఐపిఎల్ లో ఉన్న ఏ టీం కి సాధ్యం కాలేదు. ఎక్కువసార్లు ప్లే ఆఫ్ కు అర్హత సాధించిన టీమ్గా.. ఎక్కువసార్లు ఫైనల్స్ ఆడిన టీం గా కూడా చెన్నై సూపర్ కింగ్స్ కొనసాగుతుంది అని చెప్పాలి.


 అందుకే ఐపీఎల్ హిస్టరీలో చెన్నై సూపర్ కింగ్స్ అంటే ఒక ఛాంపియన్ టీం అని అందరూ చెప్పుకుంటూ ఉంటారు.  అలాంటి సూపర్ కింగ్స్ జట్టుకి ఇప్పుడు ఘోర పరాభవం ఎదురయింది. ఇటీవల కాలంలో ఐపీఎల్ లో భాగమైన ఫ్రాంచైజీలు అన్ని ఇతర దేశాల క్రికెట్ లీగ్లలో కూడా జట్లను కొనుగోలు చేయడం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలోనే అమెరికన్ మేజర్ లీగ్ లో కూడా అటు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ  టెక్సాస్ జట్టును కొనుగోలు చేసింది. అయితే ఐపీఎల్లో ఛాంపియన్ జట్టు అయిన ఈ టీం కి అక్కడ మాత్రం ఘోర పరాభవం ఎదురయింది.


 ఇటీవల సీటెల్ ఒర్కాస్ తో జరిగిన మ్యాచ్ లో టెక్సాస్ సూపర్ కింగ్స్ జట్టు ఘోర ఓటమి చెందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టెక్సాస్ సూపర్ కింగ్స్ జట్టు 20 ఓవర్లకు 126 పరుగులు చేసింది. అయితే వోర్కాస్ జట్టు 15 ఓవర్లకే లక్ష్యాన్ని చేదించి ఘన విజయాన్ని అందుకుంది. ఇక ఒర్కాస్ ఓపెనర్ డీకాక్ 88 పరుగులతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు అని చెప్పాలి. అయితే నాకౌట్ మ్యాచ్ లలో సూపర్ కింగ్స్ టీం ఇలాంటి పరాభవాన్ని చవి చూడడంతో ఫ్యాన్స్ జీవించుకోలేకపోతున్నారు. అయితే ఈ మ్యాచ్ లో విజయం ద్వారా ఓర్కాస్ టీం ఫైనల్ కు చేరింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: