ఈ క్రమంలోనే 2-1 తేడాతో అటు టీమిండియా వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది అని చెప్పాలి. అయితే ఇలా వెస్టిండీస్ జట్టుకు వారి సొంతగడ్డ పైనే షాకులు ఇస్తూ వరుస సిరీస్లను గెలుచుకుంటున్న టీమిండియా.. ఇక ఇప్పుడు మరో సిరీస్ పై కన్నేసింది. వెస్టిండీస్ పర్యటనలో భాగంగా హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో టీమిండియా టి20 సిరీస్ ఆడాల్సి ఉంది అన్న విషయం తెలిసిందే. నేటి నుంచి భారత్ - వెస్టిండీస్ మధ్య టి20 సిరీస్ ప్రారంభం కాబోతుంది. 5 మ్యాచ్ల టి20 సిరీస్ లో భాగంగా ఈరోజు రాత్రి 8 గంటలకు తొలి మ్యాచ్ జరగబోతుంది. అయితే టీ20 ఫార్మాట్లో వెండిస్ ఆటగాళ్లను తక్కువ అంచనా వేయలేము. దీంతో ఈ సిరీస్ లో ఎవరు పైచేయి సాధిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉంటే అటు హార్దిక్ పాండ్యా వన్డే సిరీస్ లో కూడా రెండు మ్యాచ్ లకు కెప్టెన్ గా వ్యవహరించాడు అన్న విషయం తెలిసిందే. ఇక తన కెప్టెన్సీలో బరిలోకి దిగిన టీం ఇండియా రెండో మ్యాచ్లో ఓడిపోగా మూడో మ్యాచ్లో విజయం సాధించి సిరీస్ ను దక్కించుకోగలిగింది. మరి ఇప్పుడు హార్దిక్ టి20 సిరీస్ లో తన కెప్టెన్సీ తో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు అన్నది హాట్ టాపిక్ గా మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి