అయితే టీమిండియా ప్రదర్శన చూసి ఇక ఈసారి భారత జట్టు కప్పు కొట్టడం ఖాయమని ఎంతోమంది క్రికెట్ విశ్లేషకులు కూడా అంచనా వేస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇక భారత్ ఇప్పటికే ఫైనల్ లో అడుగు పెట్టింది మరి ఇప్పుడు ఫైనల్లో అడుగుపెట్టి భారత్తో తలబడబోయే రెండో టీం ఏది అనే విషయంపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతూ ఉంది అని చెప్పాలి. అయితే సూపర్ 4 లో భాగంగా ఆడిన రెండు మ్యాచ్లలో కూడా ఓడిపోయిన బంగ్లాదేశ్.. ఆసియా కప్ రేస్ నుంచి నిష్క్రమించింది. ఈ క్రమంలోనే ఫైనల్ రేసులో ప్రస్తుతం పాకిస్తాన్, శ్రీలంక జట్లు మాత్రమే ఉన్నాయి.
ప్రస్తుతం శ్రీలంక రన్ రేట్ పాకిస్తాన్ రన్ రేట్ తో పోల్చి చూస్తే కాస్త మెరుగ్గా ఉంది. ఈ క్రమంలోనే ఫైనల్ కు చేరబోయే జట్టు ఏది అనే విషయంపై అటు క్రికెట్ విశ్లేషకులు కూడా ఒక అంచనాకు రాలేకపోతున్నారు అని చెప్పాలి. అయితే ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్, శ్రీలంక మధ్య సూపర్ ఫోన్లో భాగంగా మ్యాచ్ జరుగుతుంది అని చెప్పాలి. అయితే ఇక ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్ లో అడుగుపెడుతుంది. అయితే ఇటీవల వర్షం కారణంగా ఎన్నో కీలకమైన మ్యాచులు ఆసియా కప్ లో రద్దువుతున్నాయి. ఒకవేళ పాకిస్తాన్, శ్రీలంక మధ్య జరుగుతున్న మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దు అయితే.. ఇక రన్ రేట్ కారణంగా శ్రీలంక అటు ఫైనల్ లో అడుగుపెడుతుంది అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి