టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మొన్నటి వరకు సరైన ఫామ్ చూపించలేక పోయాడు. పేలవ ప్రదర్శనతో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాడు అన్న విషయం తెలిసిందే. కానీ వరల్డ్ కప్ సమీపిస్తున్న కొద్ది ఇక రోహిత్ శర్మ ఫామ్ మరింత మెరుగుపడుతూ వస్తుంది. ఈ క్రమంలోనే ఇక ఓపెనర్ గా బరీలోకి దిగుతూ అద్భుతమైన ప్రదర్శనలు చేస్తూ ఆకట్టుకుంటూ ఉన్నాడు. ముఖ్యంగా వన్డే ఫార్మాట్లో ఇరగదీస్తూ ఉన్నాడు అని చెప్పాలి. రోహిత్ ఫామ్ లోకి రావడంతో ఈసారి వరల్డ్ కప్ లో భారత జట్టు విశ్వ విజేతగా నిలవడం పక్క అని టీమ్ ఇండియా ఫ్యాన్స్ అందరు కూడా అనుకుంటున్నారు అని చెప్పాలి.


 అయితే ఇప్పటికే భారత జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగుతూ ఎప్పుడు అత్యుత్తమ ప్రతిభ కనబరిచే రోహిత్ శర్మ.. ఇప్పటికే తన ఆట తీరుతో ఎన్నో రికార్డులు కొల్లగొట్టాడు. ఇకపోతే ఇటీవల మరో అరుదైన ఘనత సాధించాడు. ఈ భారత స్టార్ బ్యాట్స్మెన్  వన్డే క్రికెట్ చరిత్రలో 50 ప్లస్ యావరేజ్ తో పాటు 100 ప్లస్ స్ట్రైక్ రేట్ గణాంకాలతో వెయ్యి పదవులు పూర్తిచేసిన ఏకైక కెప్టెన్ గా రికార్డు సృష్టించాడు. ఏకంగా ఆసియాలోనే ఏ కెప్టెన్ కి సాధ్యం కానీ ఈ రికార్డును సాధించాడు రోహిత్ శర్మ. కెప్టెన్గా 33 మ్యాచ్లలో 1450 పరుగులు చేశాడు. 55.76 యావరేజ్ తో 105.52 తో ఇక ఈ పరుగులు చేశాడు. ఇక ఓవరాల్ గా వన్డే ఫార్మాట్లు 205  వన్డేలు వాడిన రోహిత్ శర్మలో 10 వేలకు పైగా పరుగులు సాధించాడు అని చెప్పాలి. ఇందులో 32 సెంచరీలు 3 డబ్బులు సెంచరీలు   52 హాఫ్ సెంచరీలు ఉన్నాయి అని చెప్పాలి.


 ఇక ఎప్పుడూ వరల్డ్ కప్ లో అత్యుత్తమ ప్రదర్శన చేసి జట్టును గెలిపించేందుకు సిద్ధమయ్యాడు రోహిత్ శర్మ. భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో టీమ్ ఇండియా టైటిల్ ఫేవరెట్ గా బరులోకి దిగుతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే తప్పకుండా వరల్డ్ కప్ గెలుస్తుంది అని టీమిండియా ఫ్యాన్స్ అందరూ కూడా బలంగా నమ్ముతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: