అయితే ఇలా ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్న టీమిండియా కు మాత్రం న్యూజిలాండ్ పై ఉన్న గత రికార్డులు కాస్త కలవరం పెడుతున్నాయి అని చెప్పాలి. ఇప్పటివరకు ప్రపంచకప్ లో న్యూజిలాండ్, టీమిండియా మధ్య జరిగిన మ్యాచ్ లు చూసుకుంటే పూర్తిగా డామినేట్ చేసింది మాత్రం న్యూజిలాండ్ టీం అని చెప్పాలి. అంతేకాదు 2019 వన్డే వరల్డ్ కప్ లోను అటు భారత జట్టు న్యూజిలాండ్ చేతుల్లోనే ఓడిపోయి ఇంటి బాట పట్టింది. దీంతో ఇప్పుడు ఏం జరగబోతుందో అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇదే విషయం గురించి న్యూజిలాండ్ మాజీ బౌలర్ రాస్ టేలర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ ఎదుర్కోవాల్సి రావడంతో భారత జట్టు పైనే ఎక్కువ ఒత్తిడి ఉంటుంది అంటూ న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ రాష్ టేలర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ ప్రపంచకప్ టోర్నమెంట్ లో ఇండియా హాట్ ఫేవరెట్ గా గ్రూప్ స్టేజిలోనూ అద్భుతంగా ఆడింది. కానీ కోల్పోవడానికి ఏమీ లేని స్థితిలో న్యూజిలాండ్ జట్టు ఉంటే మాత్రం అది రోహిత్ సేనకు ఎంతో ప్రమాదకరం. ఒకవేళ ఇండియా సెమి ఫైనల్లో ఏదైనా జట్టును ఎదుర్కోకూడదు అని భావిస్తే అది ఖచ్చితంగా న్యూజిలాండ్ జట్టే అంటూ టేలర్ కామెంట్ చేశాడు. కాగా ఈ న్యూజిలాండ్ మాజీ చేసిన కామెంట్స్ కాస్త హాట్ టాపిక్ గా మారిపోయాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి