ఇండియాలో క్రికెట్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రేజ్ దృశ్య ఇక ఎంతో మంది యువ ఆటగాళ్లు కూడా క్రికెట్ నే తమ ఫ్యాషన్ గా మార్చుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు. దీంతో ఇటీవల కాలంలో అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా తరఫున యంగ్ ప్లేయర్స్ తో ఎక్కువగా హవా నడుస్తూ ఉంది అని చెప్పాలి. దేశవాళీ క్రికెట్ లో ఐపీఎల్ లాంటి టోర్నీలలో అద్భుతమైన ప్రదర్శన చేస్తున్న టీమిండియా యువ ఆటగాళ్లు.. ఇక భారత సెలెక్టర్ల చూపును ఆకర్షిస్తున్నారు.


 ఈ క్రమంలోనే అతి తక్కువ సమయంలో టీం ఇండియాలో కూడా చోటు సంపాదించుకుంటూ అదరగొడుతున్నారు అని చెప్పాలి. ఇలా ఎంతో మంది యంగ్ ప్లేయర్స్ భారత జట్టులోకి వస్తూ ఉంటే ఒక ప్లేయర్ మాత్రం అవకాశాలు దక్కించుకోలేక.. మోస్ట్ ఆన్ లక్కీ క్రికెటర్ గా మారిపోయాడు. ఇండియాలో మోస్ట్ ఆన్ లక్కీ క్రికెటర్ ఎవరు అని అడిగితే చాలామంది సంజు శాంసన్  పేరు చెబుతుంటారు. అతను టాలెంటెడ్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్. ఐపీఎల్లో కూడా రాజస్థాన్ జట్టు కెప్టెన్గా కొనసాగుతున్నాడు. మంచి ఫామ్ లోనే ఉన్నాడు. కానీ అతన్ని సెలెక్టర్లు  అస్సలు పట్టించుకోవట్లేదు. ఆసియా కప్, ఏసియన్ గేమ్స్ మొన్నటికి మొన్న ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్.. ఇలా ఏ టోర్నీలో అతని సెలెక్ట్ చేయలేదు. కనీసం ద్వైపాక్షిక  సిరీస్ లలోనైనా ఎంపిక చేస్తారేమో అనుకుంటే.. ఆస్ట్రేలియాతో జరిగిన టి20 సిరీస్లో అతనికి చోటు దక్కలేదు. దీంతో అభిమానులు నిరాశలో మునిగిపోయారు. అయితే ఇప్పుడు సంజు ఫ్యాన్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్..  ఎట్టకేలకు సంజు కి భారత జట్టు నుంచి పిలుపు వచ్చింది. సౌత్ ఆఫ్రికాతో జరిగే వన్డే సిరీస్ కి సంజూ తో పాటు రజాక్ పాటిదార్ కు స్థానం లభించింది  డిసెంబర్ 17వ తేదీన ప్రారంభం కాబోయే మూడు వన్ డేలా సిరీస్ కోసం సౌత్ ఆఫ్రికాలో పర్యటించబోతుంది టీమిండియా.

మరింత సమాచారం తెలుసుకోండి: