వరల్డ్ కప్ ముగిసిన తర్వాత భారత జట్టు వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లతో  బిజీబిజీగా ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రపంచకప్ టోర్నీ ముగిసిన కేవలం రోజుల వ్యవధిలోనే ఆస్ట్రేలియాతో టి20 సిరీస్ ఆడటం మొదలుపెట్టింది టీం ఇండియా. ఇక ఈ సిరీస్ కు సీనియర్లకు విశ్రాంతి ఇవ్వడంతో సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీ లో యువ ఆటగాళ్లతో కూడిన టీమిండియా బరిలోకి దిగి ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. ఈ సిరీస్లో ఏకంగా 4-2 తేడాతో ఘనవిజయాన్ని అందుకున్న టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంది అని చెప్పాలి.


 అయితే ఇక ఈ సిరీస్ ముగిసిందో లేదో ఇప్పుడు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమైంది భారత జట్టు. ఇక ఈ పర్యటనలో భాగంగా ప్రోటీస్ జట్టుతో మూడు ఫార్మట్లలో కూడా ద్వైపాక్షిక సిరీస్ లు ఆడబోతుందే అని చెప్పాలి. ఇక ఇప్పటికే ఈ మూడు ఫార్మాట్లలో సిరీస్ లు ఆడబోయే జట్టు వివరాలను కూడా బిసిసిఐ అధికారికంగా ప్రకటించింది. టి20 ఫార్మాట్కు సూర్య వన్డేలకు కేఎల్ రాహుల్ టెస్టులకు రోహిత్ శర్మ సారధ్య బాధ్యతలు వహించబోతున్నారు. అయితే ప్రొటీస్ గడ్డపై ఉండే బౌన్సి పిచ్ లపై ఇక ఆ టీం బౌలర్లను ఎదుర్కోవడం టీమిండియా కు కాస్త కఠినమైన సవాలు లాంటిదే అని చెప్పాలి.


 అయితే ఇటీవల ఇదే విషయం గురించి టీమిండియా కోచ్ గా వ్యవహరిస్తున్న ద్రావిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసేసాడు. దక్షిణాఫ్రికా పై గెలవడం అంత ఈజీ కాదు అంటూ చెప్పుకొచ్చాడు. రాహుల్ ద్రావిడ్ సౌత్ ఆఫ్రికా పిచ్ లపై బ్యాటింగ్ చేయడం భారత బ్యాట్స్మెన్ లకు ఒక సవాలు లాంటిదే. గత రికార్డులు చూసుకుంటే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా జోహాన్నస్ బర్క్, సెంచూరియన్ పిచ్ లలో బ్యాటింగ్ చేయడం ఇంకా కష్టం. ప్రత్యేక ప్రణాళికలతో ఆడితేనే పరుగులు రాబడతారు.  ప్రతి ఒక్కరి కోసం ప్రత్యేకమైన ప్రణాళిక సిద్ధం చేసాం అంటూ రాహుల్ ద్రావిడ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: