2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ కు సంబంధించి ఇప్పటినుంచి హడావిడి మొదలైంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే డిసెంబర్ 19వ తేదీన మినీ వేలం ప్రక్రియ జరగబోతుంది. అయితే అంతకుముందే ఐపీఎల్ ట్రేడింగ్ లో భాగంగా అన్ని టీమ్స్ కూడా తమకు కావాలి అనుకున్న ఆటగాడిని ఇతర టీమ్స్ నుంచి ట్రేడింగ్ చేసుకుంటూ ఉండడం కూడా చూస్తున్నాం. దీంతో చాలామంది ప్లేయర్లు ఒక టీం నుంచి మరో టీం లోకి వెళ్ళిపోతున్నారు. అయితే ఇక డిసెంబర్ 19వ తేదీన జరగబోయే ఐపీఎల్ మినీ వేలంలో ఎంతో మంది స్టార్ ప్లేయర్లు పాల్గొంటున్నారు అని చెప్పాలి.


 దీంతో ఇక అన్ని ఫ్రాంచైజీలు కూడా ఆయా స్టార్ ప్లేయర్లను దక్కించుకునేందుకు పోటీపడే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. దీంతో ఏ టీం ఎవరిని కొనుగోలు చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంది అనే విషయంపై ఎంతో మంది మాజీ క్రికెటర్లు కూడా తమ అంచనాలను రివ్యూల రూపంలో సోషల్ మీడియాలో చెప్పేస్తూ ఉన్నారు. దీంతో ఇలాంటి రివ్యూలు తెగ హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి. కాగా ఈసారి పంజాబ్ కింగ్స్ జట్టు వేలంలో ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపించే అవకాశం ఉంది అంటూ టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా అభిప్రాయం వ్యక్తం చేశాడు.


 ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావెస్ హెడ్ కోసం పంజాబ్ టీం ప్రయత్నించింది అంటూ తెలిపాడు  అయితే ఆఫ్గనిస్తాన్ ఆల్ రౌండర్ అస్మతుల్లాను కూడా పంజాబ్ ఫ్రాంచైజీ దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది అంటూ ఆకాష్ చోప్రా తెలిపాడు. ప్రస్తుతం ఆల్ రౌండర్ సామ్ కరణ్ ను పంజాబ్ వదిలేసింది. ఇక అతని స్థానంలో అజ్మతుల్లాను ఆడించాలని పంజాబ్ యాజమాన్యం భావిస్తుంది. టీమిండియా ఫేసర్ శార్దూల్ ఠాగూర్ పై కూడా పంజాబ్ కింగ్స్ కన్నేసింది అంటూ ఆకాష్ చోప్రా  తెలిపాడు. ఇక ఈ ఆటగాళ్ల కోసం భారీగా ఖర్చు చేసేందుకు కూడా పంజాబ్ యాజమాన్యం వెనకడుగు వేయదు అంటూ అభిప్రాయపడ్డాడు ఆకాష్ చోప్రా.

మరింత సమాచారం తెలుసుకోండి: