ఎన్నో రికార్డులు కొల్లగొట్టాలి అనే పట్టుదలతో కూడా ఉంటారు. అయితే టెస్ట్ ఫార్మాట్ అనేది అటు ప్రతి ఆటగాడి ప్రతిభకు సవాల్ విసురుతూ ఉంటుంది అని చెప్పాలి. అంతేకాదు ఇక ఆటగాళ్ల ఓపికకు పరీక్ష పెడుతూ ఉంటుంది. అందుకే టెస్ట్ ఫార్మాట్లో రానించిన ఆటగాడు.. ఏ ఫార్మాట్లో అయినా రాణించగలరు అని క్రికెట్ విశేషకులు కూడా అభివర్ణిస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే కొంతమంది ఆటగాళ్ళు పరిమిత ఓవర్ల క్రికెట్ లొ బాగా రాణించిన టెస్ట్ ఫార్మాట్ కి వచ్చేసరికి మాత్రం చెత్త ప్రదర్శనలతో విమర్శలు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే టెస్ట్ క్రికెట్ యొక్క గొప్పతనం గురించి టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఇటీవల స్టార్ స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు విరాట్ కోహ్లీ. ఈ క్రమంలోనే టెస్ట్ క్రికెట్ గురించి మాట్లాడుతూ మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా టెస్టు క్రికెట్లో మీరు ప్రత్యేకమైన టెంపర్మెంట్ చూపాల్సి ఉంటుంది ఇది ఒక రోజు లేదా కొన్ని గంటలు ఆడే ఆట కాదు. టెస్టు క్రికెట్ మిమ్మల్ని పూర్తిగా పరీక్షిస్తుంది. ఇదే అసలైన ఆట అంటూ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. కాగా విరాట్ కోహ్లీ ఇప్పటివరకు టెస్ట్ ఫార్మాట్లో ఎన్నో ఘనతలు సాధించాడు అన్న విషయం తెలిసిందే. ఇటీవల సౌత్ ఆఫ్రికా తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్ లో 38 రెండో ఇన్నింగ్స్ లో 76 పరుగులు చేశాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి