(ఐ పీ ఎల్) ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అత్యంత ప్రజాదరణ పొందిన టీమ్ లలో "ఆర్ సి బి" రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీం ఒకటి . ఇప్పటి వరకు ఈ టీం ఒక్క సారి కూడా కప్ ను గెలవలేదు . అయినప్పటికీ "ఐ పీ ఎల్" స్టార్ట్ అయ్యింది అంటే చలు బెంగళూరు టీం పై ప్రేక్షకులు భారీ స్థాయి లో అభిమానాన్ని చూపిస్తూ ఉంటారు.

ఇంతలా బెంగళూరు టీం కు క్రేజ్ ఉండడానికి ప్రధాన కారణం ఈ టీం లో విరాట్ కోహ్లీ ఉండడం . విరాట్ కోహ్లీ ఈ టీం లో ఆడుతూ ఉండడం తో ఈ టీం కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తూ ఉంటుం ది. ఇక పోతే "ఐ పి ఎల్ 2024" సీజన్ లో భాగంగా బెంగళూరు టీం ఇప్పటి వరకు మూడు మ్యాచ్ లను ఆడగా అందులో కేవలం ఒక మ్యాచ్ లో మాత్రమే గెలుపొందింది.

ఇకపోతే నిన్న బెంగుళూరు టీం కోల్కత్తా నైట్ రైడర్స్ తో ఓ మ్యాచ్ ఆడింది . ఇందులో బెంగుళూరు ఓటమిని సాధించింది. అయినప్పటికీ ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 83 పరుగులను సాధించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు . ఇక పోతే నిన్నటి మ్యాచ్ లో బెంగళూరు ఒక అరుదైన రికార్డు ను అందుకుంది.

నిన్నటి మ్యాచ్ తో ఇండియన్ ప్రీమియర్ లీగ్ "ఐ పీ ఎల్" చరిత్రలో 1500 సిక్సర్ లను కొట్టిన రెండవ టీం గా నిలిచింది. ఇకపోతే ఇప్పటి వరకు కేవలం ముంబై ఇండియన్స్ జట్టు మాత్రమే ఈ జాబితాలో ఉంది. నిన్నటి మ్యాచ్ లో కోహ్లీ 2 సిక్సర్ లు కొట్టగా ... గ్రీన్ రెండు సిక్సర్లు కొట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

rcb