ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐ పీ ఎల్) కి ఇండియాలో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాదాపు ఐపిఎల్ రెండున్నర నెలల పాటు సాగుతూ ఉంటుంది. ఐ పీ ఎల్ ప్రారంభం అయ్యి పూర్తి అయ్యే వరకు ఇండియాలోని క్రికెట్ అభిమానులు అంతా ఎంతో హ్యాపీ గా ఈ మ్యాచ్ లను ఎంజాయ్ చేస్తూ ఉంటారు . ఇక తమ అభిమాన జట్టు కనుక మంచి పెర్ఫార్మన్స్ ను కనబరిచినట్లు అయితే వారు మరింత ఆనందంగా ఉంటారు. ఇకపోతే ఐపిఎల్ మ్యాచ్ లలో విదేశీ ఆటగాళ్లకు కూడా మంచి గుర్తింపు ఉంది.

దానితో ఐ పీ ఎల్ జట్లు భారీ మొత్తంలో డబ్బులతో విదేశీ ఆటగాలను కొనుగోలు చేస్తూ ఉంటుంది. కానీ అందులో కొంత మంది మాత్రం సీజన్ ఫైనల్ దశకు వచ్చే సరికి ఏవో కారణాలతో తమ దేశాలకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా ఈ సీజన్ లో కూడా కొంత మంది సీజన్ చివరి దశకు రావడంతో తమ దేశాలకు తరలి వెళ్తున్నారు . ఇక ఇలాంటి విషయాలపై భారత్ మాజీ క్రికెటర్ అయినటువంటి ఇర్ఫాన్ పఠాన్ గట్టి స్ట్రోక్ ఇచ్చాడు . తాజాగా ఇర్ఫాన్ పఠాన్ తన సోషల్ మీడియా వేదికగా ... సీజన్ మొత్తం అందుబాటులో ఉండండి లేదా రావద్దు అంటూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేశాడు.

ఇక మరికొన్ని రోజుల్లోనే టి20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ క్రికెటర్స్ అయినటువంటి బట్లర్ , జాక్స్ వంటి ప్లేయర్లు ఇప్పటికే స్వదేశానికి వెళ్లిపోయారు. ఐపీఎల్ ప్లే ఆప్స్ ముందట ఉంది. ఇలాంటి కీలక సమయంలో జట్లకు ప్రతి మ్యాచ్ ఎంతో కీలకమైనది. ఈ సమయంలో విదేశీ ఆటగాళ్లు వెళ్లిపోవడం కొన్ని జట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: