రషీద్ ఖాన్.. క్రికెట్ ఫాలో అయ్యే ప్రేక్షకులందరికీ ఈ పేరు తెలియకుండా అస్సలు ఉండదు అని చెప్పాలి. ఎందుకంటే వరల్డ్ క్రికెట్లో అత్యుత్తమ స్పిన్నర్లు ఎవరు అని చర్చ వచ్చినప్పుడల్లా.. మొదటి వరుసలో వినిపించే పేరు రషీద్ ఖాన్. అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన అతి తక్కువ సమయంలోనే తన సత్తా ఏంటో వరల్డ్ క్రికెట్ కు నిరూపించుకున్న ఆటగాడు అతను. మహా మహా బ్యాట్స్మెన్లను సైతం ఎంతో అలవోకగా బోల్తా కొట్టించి వికెట్ పడగొట్టగల సత్తా అతని సొంతం. కేవలం బౌలింగ్ తో మాత్రమే కాదండోయ్ ఏకంగా బ్యాటింగ్లో కూడా తనకు తిరుగులేదు అని నిరూపించాడు రషీద్ ఖాన్.


 ఆఫ్ఘనిస్తాన్ లాంటి చిన్న టీం కి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఇక అతను తన ప్రదర్శనతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడూ అత్యుత్తమమైన ప్రదర్శన చేస్తూ వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాడు అని చెప్పాలి. ఇక ఇప్పటివరకు టి20 ఫార్మాట్లో అతను సృష్టించిన రికార్డులు అన్ని ఇన్ని కావు. అయితే ఇక ఇప్పుడు మరో అరుదైన రికార్డు సృష్టించి వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయాడు ఈ స్పిన్నర్.  ఈ క్రమంలోనే అతను సాధించిన రికార్డు గురించే ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు అని చెప్పాలి.



 ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ జట్టుకి టి20 కెప్టెన్గా కొనసాగుతున్న రషీద్ ఖాన్ ఇటీవల చరిత్ర సృష్టించాడు. టి20 క్రికెట్లో 600 వికెట్లు తీసుకున్న రెండవ బౌలర్గా అరుదైన ఘనతను సాధించాడు. మెన్స్ హండ్రెడ్ టోర్నీలో ట్రెంట్ రాకెట్స్ తరఫున రషీద్ ఖాన్ ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే మాంచేస్టర్  ఒరిజినల్స్ తో జరిగిన మ్యాచ్ లో వికెట్లు తీయడం ద్వారా ఈ ఘనత సాధించాడు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ లిస్టులో వెస్టిండీస్ మాజీ ఆల్రౌండర్ బ్రావో 630 వికెట్లతో ఇక అగ్రస్థానంలో కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి. రషీద్ ఖాన్ కెరియర్ ఇంకా సుదీర్ఘ కాలం పాటు సాగుతుంది కాబట్టి ఈ రికార్డును బద్దలు కొట్టడం పెద్ద కష్టమేమీ కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: