అవును, చైనా దిగ్గజం లిరెన్ కావాలనే ఓడిపోయాడంటూ కామెంట్ చేయడం ఇపుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. రష్యా చెస్ ఫెడరేషన్ చీఫ్ అండ్రీ ఫిలటోవ్ ఈ సందర్భంగా స్పందిస్తూ... "ఈ మ్యాచ్ రిజల్ట్ చెస్ అభిమానులు, నిపుణులను ఆశ్చర్య పోయేలా చేసింది. ఎంతో ఉత్కంఠంగా జరిగిన ఈ ఆటలో చైనీస్ ఆటగాడి చర్యలు చాలా అనుమానంగా కనబడ్డాయి. లిరెన్ ఉన్న స్థితిలో అతడు ఓడిపోవడం అనేది దాదాపు జరగదు. కానీ, అతడు చేసిన సిల్లీ తప్పులు ఇపుడు అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఉద్దేశపూర్వకంగానే అలా ఓడిపోయాడా, లేదంటే దీని వెనక ఎవరి హస్తం అయినా ఉందా? అనే అనుమానాలు ఉన్నాయి. అందుకే దీనిపై అంతర్జాతీయ చెస్ ఫెడరేషన్ (ఫిడే) ప్రత్యేకంగా విచారణ జరపాలి!" అని డిమాండ్ చేశారు.
దాదాపు 4 గంటలకు పైగా సాగిన ఆఖరి గేమ్ 58 ఎత్తుల్లో ముగిసింది. అయితే 55వ ఎత్తులో లిరెన్ ఏనుగును కదపడం వలన గుకేశ్‌కు బాగా కలిసొచ్చినట్టు అయింది. దాంతో అతడు వెనక్కి తిరిగి చూసుకోలేదు. లిరిన్ తప్పిదం తర్వాత ఆట ఎంతోసేపు సాగలేదు. కట్ చేస్తే... చైనా గ్రాండ్‌మాస్టర్ ఓటమిని అంగీకరించక తప్పలేదు. దీంతో 7.5-6.5 పాయింట్లతో గుకేశ్ విశ్వవిజేతగా నిలిచాడు. 18 ఏళ్ల వయసులోనే ఈ విజయాన్ని అందుకొని అత్యంత పిన్నవయసు చెస్ ప్రపంచ ఛాంపియన్‌గా గుకేశ్ చరిత్రపుటల్లోకి ఎక్కాడు. చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ గెలుచుకున్న తర్వాత గుకేశ్ మీడియాతో మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యాడు.