ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఇంట పండగ వాతావరణం నెలకొంది.  గుత్తా జ్వాల ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.  ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ప్రతి ఒక్కరికి సుపరిచితమే. గుత్తా జ్వాల బ్యాడ్మింటన్ రంగంలో మంచి ప్రతిభను సాధించింది. ఇక గుత్తా జ్వాల వ్యక్తిగత విషయానికి వచ్చినట్లయితే... తమిళ నటుడు విష్ణు విశాల్ ను 2021 ఏప్రిల్ 22న వివాహం చేసుకున్నారు. ఇది వరకే ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా, విష్ణు విశాల్ వీరిద్దరికీ వివాహాలు అయ్యాయి. 

అయితే వ్యక్తిగత కారణాలవల్ల వారి జీవిత భాగస్వాముల నుంచి వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు చేతన్ ఆనంద్ ను వివాహం చేసుకున్న జ్వాల ఆరేళ్లు పాటు కలిసి ఉన్న అనంతరం విడాకులు తీసుకుంది. ఇద్దరి విడాకులకు సంబంధించిన కారణం ఇప్పటివరకు బయటకు రాలేదు. 

కానీ ఇద్దరు కలిసి ఉన్నంతవరకు విభేదాలతోనే సరిపోయిందని వారి సన్నిహితులు వెల్లడించారు. ఇద్దరూ వారి వైవాహిక బంధం కారణంగా ఆట కూడా దెబ్బతిన్నదని చెబుతూ ఉంటారు. ఈ క్రమంలోనే బ్యాడ్మింటన్ క్రీడాకారిని గుత్తా జ్వాల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె భర్త నటుడు విష్ణు విశాల్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.

 'మాకు పండంటి ఆడ పిల్ల పుట్టింది. ఆర్యన్ ఇప్పుడు అన్నయ్య అయ్యాడు. మాకు దేవుడు ఇచ్చిన బహుమతిగా మా కూతురుని భావిస్తున్నాం. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలు కావాలి' అని తెలుపుతూ ఎక్స్ లో ఓ ఫోటోను షేర్ చేసుకున్నారు. వీరికి ఎక్స్ వేదిక గా ప్రముఖులు అందరు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిని గుత్తా జ్వాల అలాగే నటుడు విష్ణు విశాల్... ఇద్దరు తల్లి దండ్రులు అయిన నేపథ్యం లో సినీ ప్రముఖులు కూడా... వాళ్ళిద్దరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: