
ఈ రెండు జట్లు మొదటి సీజన్ నుంచి లీగ్ లో చాలా చాలా టఫ్ గా పోటీ పడుతూ వస్తున్నాయి . రెండు కూడా పోటాపోటీగా టైటిల్ మాది అంటే మాది అన్నట్లు ఆడుతూ వచ్చాయి . ఫైనల్స్ లో ఈ రెండు జట్లే పడటం ఇంకా క్యూరియాసిటీ పెంచేస్తుంది. ఈ క్రమంలో అభిమానులు ఈ సీజన్లో కొత్త ఛాంపియన్ పొందడం ఖాయం అంటున్నారు . అయితే మంగళవారం హైదరాబాద్ అహ్మదాబాద్ లో వర్షం పడే అవకాశం ఉన్నందున మ్యాచ్ కి ఇది అడ్డంకి గా మారబోతున్నట్లు తెలుస్తుంది. ఒక్కవేళ వర్షం పడితే పరిస్ధితి ఏంటి..? ఎవరిని విన్నర్ గా ప్రకటిస్తారు..? ఎవరికి కప్ వెళ్తుంది..? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మాట్లాడుకుంటున్నారు జనాలు.
మంగళవారం మధ్యాహ్నం నగరంలో కొంతవరకు వర్షం పడే అవకాశం ఉంది అంటూ వాతావరణ శాఖ తెలిపింది. ఉష్ణోగ్రత మధ్యహ్నాం 38 డిగ్రీల సెల్సియల్స్ ఉండనుండగా సాయంత్రం అది 25 కు పడిపోబోతుంది అంటూ అంచన వేస్తున్నారు వెదర్ రిపోర్ట్. ఒకవేళ వర్షం పడితే మిగిలిన నాకోట్ మ్యాచ్లో మాదిరిగానే ఈ మ్యాచ్ కి కూడా 120 నిమిషాలు అదనపు సమయం ఇవ్వబడుతుంది . జూన్ మూడవ తేదీ వర్షం కారణంగా ఒకవేళ మ్యాచ్ జరగకపోతే అది జూన్ 4న రిజర్వ్ డే గా ఉంచుతారు. మ్యాచ్ ఫలితం ఆ రోజున రావచ్చు . అంపైర్లు మొదటి రోజే మ్యాచ్ ఫలితాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. కానీ ఇది సాధ్యం కాని పక్షంలో మ్యాచ్ రిజర్వ్ డేకు వెళ్తుంది. ఒకవేళ రెండు రోజు కూడా వర్షం కారణంగా మ్యాచ్ ఫలితం నిర్ణయించకపోతే.. పంజాబ్ కింగ్స్ ట్రోఫీ అందుకుంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు పాయింట్లు వాళ్లకే ఎక్కువ. పాయింట్ల పట్టికలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కంటే ముందంజలో ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో..???!