128 సంవత్సరాల అనంతరం క్రికెట్ మళ్లీ ఒలింపిక్ క్రీడల్లోకి ప్రవేశించనుండటం గర్వకారణంగా మారింది. 2028లో లాస్ ఏంజిల్స్ వేదికగా జరగబోయే LA28 ఒలింపిక్స్‌లో క్రికెట్ ఆసక్తికర పోటీగా నిలవనుంది. గతంలో 1900లో ఫ్రాన్స్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో ఒకే ఒక్కసారి క్రికెట్ పోటీగా చోటు దక్కగా, ఇప్పుడు ఆ స్పోర్ట్ తిరిగి రావడం గ్లోబల్ క్రికెట్ అభిమానుల్లో సంబరాలను తెచ్చిపెట్టింది. మ్యాచ్‌లు ఎప్పుడెక్కడ? : జూలై 12 నుంచి జూలై 29, 2028 వరకు మొత్తం క్రికెట్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లు లాస్ ఏంజిల్స్‌కు 50 కిలోమీటర్ల దూరంలోని పోమెనా నగరంలోని ఫెయిర్‌గ్రౌండ్స్ స్టేడియంలో నిర్వహించబడతాయి. జూలై 14, 21 తేదీల్లో మ్యాచ్‌లు ఉండవు. మిగతా రోజుల్లో రోజు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. టీ20 ఫార్మాట్ – పురుషులు, మహిళలకు అవకాశం : t20 ఫార్మాట్‌లో పురుషులు, మహిళలు కలిపి 6 జట్లు పోటీపడతాయి. మొత్తం 180 మంది క్రికెటర్లు (ప్రతి జట్టులో 15 మంది) పాల్గొంటారు.

మహిళల మ్యాచ్‌లు: జూలై 12 నుంచి జూలై 20 వరకు ,  పురుషుల మ్యాచ్‌లు: మొదలయ్యేది జూలై 22న, ఫైనల్ జూలై 29న.. పతక పోటీలు : మహిళల ఫైనల్: జూలై 20న, పురుషుల ఫైనల్: జూలై 29న ఇవి రెండు రోజులు ఫ్యాన్స్‌కి పండుగలా ఉండనున్నాయి . అత్యుత్తమ క్రికెట్ జట్లు ఒలింపిక్ పతకాల కోసం పోటీ పడతాయంటే కుతూహలం మరింత పెరుగుతోంది. అలాగే అమెరికాలో క్రికెట్ వేడి పెరుగుతోంది .. 2024లో అమెరికా-వెస్టిండీస్ వేదికగా జరిగిన t20 ప్రపంచకప్ అద్భుతంగా జరిగిన తర్వాత, టెక్సాస్, ఫ్లోరిడా, న్యూయార్క్ వంటి నగరాల్లో క్రికెట్ పాపులారిటీ పెరిగింది. అదే ఊపులో క్రికెట్‌ను ఒలింపిక్స్ లో చేర్చడం వల్ల మరింత విస్తృత ప్రేక్షకాభిమానాన్ని పొందనుంది.

అలాగే ఐదు కొత్త క్రీడలు : LA28లో క్రికెట్‌తో పాటు ఇంకా 4 కొత్త క్రీడలు చోటు చేసుకున్నాయి: బేస్‌బాల్/సాఫ్ట్‌బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్,  లాక్రోస్,  స్క్వాష్ ..  ఈ క్రీడలను యువతను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా ఎంపిక చేసినట్టు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తెలిపింది. ఈసారి ఎవరు గెలుస్తారు? ..ఇంగ్లాండ్, భారత్, ఆస్ట్రేలియా వంటి టాప్ క్రికెట్ జట్లు ఒలింపిక్ పతక పోటీలో ఎలా రాణిస్తాయో ఇప్పుడు ప్రపంచం ఆసక్తిగా చూస్తోంది. క్రికెట్‌కు ఇది గోల్డెన్ ఛాన్స్. ఇక నుంచి ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు ఒక స్థిర స్థానం ఏర్పడుతుందా అనేది రానున్న కాలం చెబుతుంది!











మరింత సమాచారం తెలుసుకోండి: