
ఇకపోతే ఈ మధ్యకాలంలో అనసూయ ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రోలింగ్కి గురవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమెపై నెగిటివిటీ ఏర్పడిందని అందుకే అవకాశాలు కూడా తగ్గిపోయాయని పుష్పటు సినిమాలో కూడా ఈమె పాత్రకు అంత గుర్తింపు రాదని కూడా జనాలు చెప్పుకొస్తున్నారు ఇదిలా ఉండగా ఇలాంటి సమయంలోనే ఆమెకు సంబంధించిన మరొక వార్త ఇప్పుడు తెరపై మరింత సంచలనం సృష్టించింది.
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా క్రియేటివ్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుకుమార్ దర్శకత్వంలో ఇప్పుడు పుష్ప 2 సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో అనసూయ పాత్రను చాలా వరకు తగ్గించడానికి కారణం కూడా లేకపోలేదట. అనసూయ కి ఉన్న హెడ్ వెయిట్ ను తగ్గించడానికి.. ఈమె టంగ్ ను కంట్రోల్లో చేయడానికి సుకుమార్ ఇలా చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ముందు నుంచే నోటిని అదుపులో పెట్టుకొని ఆమెకు సలహా ఇస్తూ వస్తున్నారట. అయితే ఆమె మాత్రం సుకుమార్ మాటలు వినకుండా తనదైన శైలిలో రెచ్చిపోతూ ఉండడంతో సుకుమార్ అప్పట్నుంచి ఆమెను దూరం పెడుతూ వస్తున్నాడని వార్తలు బాగా వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఈమె ఇలాగే కొనసాగితే ఈమె కెరియర్ డౌన్ అయినట్లే అంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి.