తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సీరియల్ నటిగా ,జబర్దస్త్ కమెడియన్ గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది రీతూ చౌదరి.. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా నిరంతరం యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు బుల్లితెర పైన ప్రసారమయ్యేటువంటి పండుగల స్పెషల్ ఈవెంట్లలో కూడా సందడి చేస్తూ ఉంటుంది. మొదట పలు సీరియల్స్ లో నటించిన రీతూ చౌదరి పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో జబర్దస్త్ లోకి గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఇక్కడ సెటిల్ అయ్యింది.ప్రస్తుతం జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలో  నటించడమే కాకుండా ఒక టాక్ షో కి యాంకర్ గా కూడా వ్యవహరిస్తున్నది. తాజాగా రీతు చౌదరి ఒక లగ్జరీ కారు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది  ఈ కారు డెలివరీ కోసం ప్రత్యేకమైన పూజ కార్యక్రమాలను కూడా నిర్వహించింది.అలాగే తన తల్లితో కలిసి ఫస్ట్ డ్రైవ్ చేయడం తదితర కార్యక్రమాలకు సంబంధించిన వాటిని తన సోషల్ మీడియా ద్వారా వీడియో రూపంలో రిలీజ్ చేసింది. ఈ వీడియో చూసిన అభిమానులు తన స్నేహితుల సైతం కంగ్రాచులేషన్స్ చెబుతూ ఉన్నారు.


ఇక రీతు చౌదరి కొన్న కారు విషయానికి వస్తే.. క్రిస్టా హైక్రాస్ జెడ్ ఎక్స్ టాప్ మోడల్ కారును కొన్నట్టుగా తెలుస్తోంది  దీని ధర సుమారుగా  రూ.45 లక్షల రూపాయల వరకు ఉన్నట్లు సమాచారం. అయితే ఇందులో బేసిక్ మోడల్ ధర 25 లక్షల రూపాయలు ఉన్నట్లు సమాచారం. రీతు చౌదరి షేర్ చేసిన వీడియోని బట్టి చూస్తే ఈమె లగ్జరీ కారు కొన్నట్టుగానే కనిపిస్తోంది. ఈ కారు కొన్న ధరను చూసి ఒక్కసారిగా అటు అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇంత లగ్జరీ కారు కొన్న రీతు చౌదరి బుల్లితెర పైన బాగానే సంపాదిస్తోందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించి వీడియో వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: